Mysaa

Mysaa: మాస్ లుక్‌లో రష్మిక.. ‘మైసా’ రచ్చ సిద్ధం!

Mysaa: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సోలో హీరోయిన్‌గా నటిస్తున్న ‘మైసా’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. మాస్ అవతారంలో రష్మిక కనిపిస్తూ ఆకర్షిస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ డిసెంబర్ 24న రానుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

Also Read: Dragon: ఎన్టీఆర్ తల్లిగా కాజోల్.. స్పందించిన డ్రాగన్ మూవీ టీమ్

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇటీవల ‘థామా’, ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తన కెరీర్‌లో మళ్ళీ సోలోగా వస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’. అనౌన్స్‌మెంట్‌తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా మేకర్స్ లేటెస్ట్‌గా క్రేజీ మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రష్మిక బీస్ట్ మోడ్‌లో కనిపిస్తోంది. ఒక చేతిలో తుపాకీ మరో చేతిలో సంకెళ్లు పట్టుకుని ఉంది. వేషధారణ, ముఖ భావాలు చూస్తే డీ గ్లామరస్ పాత్రలో పవర్‌ఫుల్‌గా రాబోతోందని అర్థమవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్ ఫార్ములా బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలు పెంచుతోంది. గ్లింప్స్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ గ్లింప్స్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *