Mudhole

Mudhole: ముధోల్‌లో మూడు ముక్కలాట మైండ్ గేమ్ ఆడుతున్న ప్రధాన పార్టీలు

Mudhole: నిర్మల్ జిల్లా ముధోల్‌లో రాజకీయం హిటెక్కి, మూడు ముక్కలాటగా కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపొందాలంటే, ఏ వర్గంలో ఉంటే సాధ్యమవుతుందో, ఏ వర్గంలో ఉంటే అభివృద్ధి పనులకు నిధులు అందుతాయా ఇప్పటి నుంచే లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు పోటీ చేసే నాయకులు… ముథోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ కొనసాగుతుండగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనుల కార్యక్రమాలు ఎమ్మెల్యే రామారావు పటేల్,

Mudhole: అటు కాంగ్రెస్ జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి సీతక్క సహాయంతో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌ నారాయణరావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమదైన రీతిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రోసిడింగ్ కాపీలు సి.ఎం.ఆర్ చెక్కుల సైతం తీసుకొస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వర్గం వైపు కొనసాగలా! లేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ  నాయకుల వైపు కొనసాగాలా అంటూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అంత:ర్మదనం పడుతున్నారు.

ఇది కూడా చదవండి: YouTube: క్రియేటర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చిన యూట్యూబ్.. అటువంటి థంబ్‌నెయిల్ పెడితే..!

Mudhole: ఎమ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా ఏర్పడి స్థానిక రాజకీయాలు నడిపిస్తున్నారూ… అభివృద్ధికి ముగ్గురు పోటీపడి పని చేస్తున్న ఎవరికి వారు క్యాడర్‌ను కలిగి ఉండి ప్రజా సమస్యలపై, అభివృద్ధి పనులపై నిరంతరం స్పందిస్తున్నారు.దీంతో వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పోటీ చేసే ఆలోచన కలిగిన నాయకులు ఏ నాయకుని వైపు ఉంటే ప్రజల మెప్పు పొందుతామో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నాయకులకి ఎటువైపు కొనసాగి, ఉండాలో అంతుచిక్కడం లేదంటూ వాపోతున్నారు.

Mudhole: బీజేపీ నుంచి ఎమ్మెల్యే అండతో పోటీ చేస్తే గెలిచిన అభివృద్ధి పనులకు ఏమైనా ఆటంకాలు ఉంటాయా, నిధుల విడుదలలో ఏమైనా జాప్యం జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి బలమైన క్యాడర్ కలిగి ఉండటంతో తన వర్గం నుంచి ఎక్కువ అభ్యర్థులను పోటీలో ఉంచి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నాలు చేస్తుండగా… నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నారాయణ రావు పటేల్ తన వర్గం నుంచి బలమైన అభ్యర్థులను పోటీలో ఉంచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ముధోల్‌ రాజకీయం మూడు ముక్కలాటగా కొనసాగి, రసవత్తరంగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు వాపోతున్నారు.

ALSO READ  DK Aruna: ల‌గ‌చ‌ర్ల‌కు వెళ్ల‌నీకుండా ఎంపీ డీకే అరుణ అడ్డ‌గింత‌

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *