Peddi: 

Peddi: రామ్ చరణ్ కోసం MS.ధోని..?

Peddi: భారీ అంచనాలతో జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్‌కు కొద్ది రోజులే ఉన్నా, ఇప్పటివరకు ప్రొమోషన్స్‌లో జోరు పెంచని మూవీ టీమ్.. దీంతో నిరాశ చెందుతున్న అభిమానులు. ప్రొమోషన్స్ సరిగా చేయకపోతే జనాల్లోకి సినిమా వెళ్లదని, ఈ ప్రభావం సినిమా కలెక్షన్స్‌ పైన పడే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన మూవీ టీమ్ ప్రొమోషన్స్‌లో జోరు పెంచాలనుకుంటోంది.

సినిమా కథ క్రికెట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి, జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ముఖ్య అతిథిగా ఎం.ఎస్.ధోనీని పిలవాలని మూవీ టీమ్ భావిస్తోంది. ఆయన సొంతూరు కూడా ఇదే అవ్వడం విశేషం. మూవీ టీమ్ కూడా ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎం.ఎస్.ధోనీ ఈ ఈవెంట్‌కు వస్తే ఇండియా వైడ్ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఈసారి ఐపీఎల్‌లో ఎక్కువగా కనిపించకపోవడంతో ఈ ఈవెంట్ పైన అంచనాలు పెరుగుతున్నాయి.

దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్‌లో రికార్డ్స్ సృష్టించడం ఖాయం. బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో హీరోగా రామ్ చరణ్, ఆయనకు జంటగా జాన్వీ కపూర్ నటిస్తోంది. జగపతి బాబు ‘పెద్ది నాన్న’ క్యారెక్టర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన క్యారెక్టర్స్‌లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ (మున్నా భాయ్) నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *