Mrunal Thakur: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమ వ్యవహారాలు, పెళ్లి పై షాకింగ్ వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా తన మాజీ ప్రేమికుడి గురించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన దూకుడు, యాక్టింగ్ నచ్చకపోవడం కారణంగా బ్రేకప్ జరిగిందని చెప్పారు. అలాగే ధనుష్ తో వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు.ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Mega 158 : మెగాస్టార్-మోహన్‌లాల్ క్రేజీ కాంబో: ‘మెగా 158’లో గ్యాంగ్‌స్టర్ డ్రామా..
మృణాల్ ఠాకూర్ తన కొత్త సినిమా ‘దో దీవానే శహర్ మే’ ప్రమోషన్ల సందర్భంగా మాజీ ప్రేమికుడి గురించి మాట్లాడారు. అతను తన దూకుడు, అసర్టివ్ పర్సనాలిటీతో ఉండలేనని బ్రేకప్ చెప్పాడట. ఆమె యాక్టింగ్ చేయడం కూడా అతనికి నచ్చలేదు. ఆ కారణాలతో విడిపోయారు. అయితే బ్రేకప్‌కు బాధపడలేదని, అతని మనస్తత్వానికి జాలి పడ్డానని చెప్పారు. అలాంటి వ్యక్తితో కొనసాగడం కష్టమని, భవిష్యత్తులో పిల్లలు అదే భావనలతో పెరగకూడదని అన్నారు. అతనికి దూరం జరిగినందుకు సంతోషమని తెలిపారు. ధనుష్‌తో రిలేషన్ రూమర్లని కూడా మృణాల్ ఖండించారు. అతను మంచి స్నేహితుడని చెప్పారు. ఈ కామెంట్స్ ఆమె ఓపెన్ నేచర్‌ను చూపిస్తున్నాయి.
