MR. Manikyam

MR. Manikyam: ‘మిస్టర్ మాణిక్యం’గా సముద్రఖని

MR. Manikyam: దర్శకత్వం నుంచి నటనపై దృష్టి సారించిన సముతిర ఖని ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నాడు. తను నటించిన ‘అల వైకుంఠపురములో, విమానం, క్రాక్, హనుమాన్’ వంటి సినిమాలలోని పాత్రలద్వారా ప్రేక్షకాదరణ పొందారు సముతిర ఖని. తాజాగా ‘మిస్టర్ మాణిక్యం’గా ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. నంద పెరియసామి దర్శకత్వంలో రేఖా రవికుమార్, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన ఈ మూవీ డిసెంబర్ 28న విడుదల కానుంది.

MR. Manikyam: ఈ సినిమా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ పోస్టర్ ను ఏషియన్ సునీల్ నారంగ్ ఆవిష్కరించారు. ‘విమానం’ తర్వాత నటుడిగా తనకు అంతటి పేరు తెచ్చే చిత్రం ‘మిస్టర్ మాణిక్యం’ అని మానవతా విలువలు ప్రధానాంశంగా క్లీన్ ఎంటర్ టైనర్ గా కుటుంబసమేతంగా చూసే చిత్రమిదని అంటున్నారు సముతిర ఖని. ఎంతో ఇష్టపడి ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాతల్లో ఒకరైన రవి చెబుతున్నారు. ఇందులో మాణిక్యం భార్యగా అనన్య నటించగా ఇతర పాత్రలలో భారతీరాజా, నాజర్, తంబి రామయ్య, ఇళవరసు, తరుణ్, కరుణాకరన్, చిన్ని జయంత్, వడివుక్కరసి కనపించనున్నారు. మరి ఈ చిత్రం సముతిర ఖనికి ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Devara Part-2: ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ రెడీ.. భారీ అంచనాలతో కొరటాల శివ మాస్టర్ ప్లాన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *