Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా జరుగుతున్నా దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లోని కొంతమంది వైద్యులు బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నారు. సిలుగురిలోని డాక్టర్ శేఖర్ బందోపాధ్యాయ తన ప్రైవేట్ క్లినిక్‌లో త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఈ జెండాతో పాటు అక్కడ “భారతదేశ జాతీయ జెండా మా తల్లి లాంటిది. దయచేసి ఛాంబర్‌లోకి ప్రవేశించే ముందు త్రివర్ణ పతాకానికి వందనం చేయండి. ముఖ్యంగా బంగ్లాదేశ్ పేషెంట్లు సెల్యూట్ చేయకపోతే లోపలికి రానివ్వబోము” అంటూ బోర్డు ఏర్పాటు చేశారు.
డాక్టర్ శేఖర్ బందోపాధ్యాయ నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో మన జాతీయ జెండాను అవమానించడం చూసి నేను బాధపడ్డాను అని చెప్పారు. డాక్టర్‌గా నేను రోగులను తిప్పి పంపించాలని అనుకోను. కానీ నా దేశానికి వచ్చే ప్రజలు మన జెండాను, మన మాతృభూమిని గౌరవించాలి అన్నారు. బంగ్లాదేశ్ తాలిబానీ మనస్తత్వంలోకి జారిపోయినట్లుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: EVM Hack: ఈవీఎంలను హ్యాక్ చేశారంటూ ఈసీ కేసు
Bangladesh: అంతేకాకుండా కొంతమంది డాక్టర్లు ఏ బంగ్లాదేశ్ రోగికి చికిత్స చేయబోమని చెబుతున్నారు జనరల్ సర్జన్ – చైల్డ్ స్పెషలిస్ట్ చంద్రనాథ్ అధికారి తన ప్రైవేట్ క్లినిక్‌లో బంగ్లాదేశ్ రోగికి చికిత్స చేయనని ప్రకటించారు. నేను బోల్పూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి అటాచ్ అయి ఉన్నాను. అక్కడ, నేను ఏ రోగిని తిరస్కరించలేను, కానీ నా క్లినిక్‌లో అలా చేసే స్వేచ్ఛ నాకు ఉంది. నేను బంగ్లాదేశ్ రోగులను చూడకూడదని నిర్ణయించుకున్నాను. బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని చెప్పారు ఆ డాక్టర్.
కోల్‌కతా-అగర్తలా ఆసుపత్రులు బంగ్లాదేశీయులకు చికిత్స చేయడానికి నిరాకరించాయి కోల్‌కతా, త్రిపురలో అగర్తలకు చెందిన రెండు ఆసుపత్రులు బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడానికి ఇప్పటికే నిరాకరించాయి. కోల్‌కతాలోని జెఎన్ రే హాస్పిటల్‌కు చెందిన సుభ్రాంషు భక్త మాట్లాడుతూ- ఇప్పుడు బంగ్లాదేశ్‌లో త్రివర్ణ పతాకాన్ని అవమానిస్తున్నందున బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయరు. వారి స్వాతంత్య్రంలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది, అయినప్పటికీ వారిలో భారతదేశ వ్యతిరేక భావాలను మనం చూస్తున్నాము. ఇది విచారకరం అని అన్నారు.

