PM Resign

PM Resign: రాజీనామా చేసిన ప్రధాన మంత్రి .. ఎందుకంటే..?

PM Resign: కుమారుడి విలాసవంతమైన జీవన శైలి. లక్జరీ కార్లలో షికార్లు. హెలికాప్టర్లలో చెక్కెర్లు. ప్రధాన మంత్రి కుమారుడైనా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి విలాసవంతమైన జీవితం గడపడానికి కారణం అవినీతే అని ప్రజలు విశ్వసించారు. ప్రజాగ్రహంతో చివరకు ప్రధాన మంత్రి పదవినే త్యజించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఓయున్ ఎర్డినే మంగోలియా ప్రధాన మంత్రి గా సుదీర్ఘ కాలం పని చేశారు. 2021 జులైలో తొలిసారి ప్రధాన మంత్రి అయ్యారు. తిరిగి గత ఏడాది ఆయనే ఎన్నిక అయ్యారు. ఓయున్ ఎర్డినే సామాన్య మధ్య తగతి కుటుంబం నుంచి వచ్చినా రాజకీయంగా అంచలంచలు గా ఎదిగారు. ఆయన పీపుల్స్ పార్టీ కి చెందిన నేత అయినా అన్ని పార్టీలకూ ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తూ అఖిల పక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: KCR: మాగంటి భౌతికకాయానికి నివాళులర్పించిన కేసీఆర్

నలేరు మీద నడకగా ఆయన ప్రభుత్వ పాలన సాగుతున్న తరుణంలో కుమారుడి రూపంలో అనుకోని ఉప ద్రవం వచ్చి పడింది. 23 ఏళ్ళ ఓయున్ ఎర్డినే కుమారుడు టెమూలెన్ హార్వర్డ్ యూనివర్సిటీ లో చేరినా చదువు కు అర్దంతరంగా స్వస్తి పలుకుతూ దేశానికి వచ్చారు. ఒక మహిళతో కుమారుడి నిశ్చితార్దం చేశారు ఓయున్ ఎర్డినే. కాబోయే భార్యకు కుమారుడు అత్యంత ఖరీదైన గిఫ్ట్ లు ఇచ్చాడు. ఖరీదైన డైమండ్ రింగ్, లక్జరీ కారు, అత్యంత విలువైన హాండ్ బాగ్ ను గిఫ్ట్ గా అందించారు. ఇరువురూ హెలికాప్టర్లలో చెక్కర్లు కొట్టారు. ఖరీదైన గిఫ్ట్ లు ఇవ్వడం, హెలికాప్టర్ లో చెక్కర్లు కొట్టడం సోషల్ మీడియా లో మంగోలియా అంతా వైరల్ అయింది.

సామాన్య మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన వారికి ఖరీదైన గిఫ్ట్ లు, హెలికాప్టర్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అవినీతే ఇందుకు కారణం. పీఎం ప్రజా సంపదను దోచుకున్నారు. మరో వైపు ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా పీఎం పట్టించుకోవడం లేదు. అందుకే ఆయన పీఎం పదవి కి రాజినామా చేయాలి అనే డిమాండ్ తో ప్రజలు రోడ్డెక్కారు. తాను అవినీతికి పాల్పడలేదని చెబుతూ వచ్చిన ఓయున్ ఎర్డినే తనకు ఎంపీల నుంచి మద్దతు ఉందనే ఉద్దేశంతో పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం పెట్టారు. కానీ విశ్వాస తీర్మానంలో నెగ్గలేక పోవడంతో ఓయున్ ఎర్డినే ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా ప్రభావానికి తోడు ప్రజలు అవినీతిని సహించరనే దానికి ఇదో తాజా ఉదాహరణ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *