Mohanlal : సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్’ సినిమా 2023లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించి అభిమానులను అలరించారు. ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, మోహన్‌లాల్ తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌లాల్ మాట్లాడుతూ, “జైలర్ 2 షూటింగ్ ప్రారంభమైంది. నేను ఈ సినిమాలో భాగమవుతానో లేదో తెలియదు. కానీ, వాళ్లు నన్ను పిలిస్తే తప్పకుండా వెళతాను. మొదటి భాగంలో డైరెక్టర్ నెల్సన్ నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు,” అని అన్నారు.ఈ వ్యాఖ్యలతో ‘జైలర్ 2’లో మోహన్‌లాల్ మళ్లీ కనిపిస్తారనే అంచనాలు మొదలయ్యాయి.
Mohanlal: మొదటి భాగంలో ఆయన నటించిన ‘మాథ్యూ’ పాత్రకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సీక్వెల్‌లో ఆ పాత్రకు మరింత ప్రాధాన్యం ఉంటుందని ఫ్యాన్స్ ఊహాగానాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉండగా, నెల్సన్ దిలీప్‌కుమార్ ‘జైలర్ 2’ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం.
Also Read: Ranbir-Deepika: మళ్ళీ తెరపై రణబీర్-దీపికా రొమాన్స్!
మోహన్‌లాల్ ప్రస్తుతం తన ‘ఎంపురాన్’ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తమిళ సినిమాలపై చూపిస్తున్న ఆసక్తి అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ‘జైలర్ 2’తో రజనీ-మోహన్‌లాల్ కాంబో మళ్లీ స్క్రీన్‌పై సందడి చేస్తుందా? ఇది తెలియాలంటే నెల్సన్ నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి!
