L2: Empuraan Collections: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ లేటెస్ట్ మూవీ ‘L2 ఎంపురాన్’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ‘లూసిఫర్’ సూపర్ హిట్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాను స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేశాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న గ్రాండ్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాల్లోనూ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. ‘L2 ఎంపురాన్’ కేవలం 48 గంటల్లోనే ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఇది కూడా చదవండి: OG: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా అప్‌డేట్: అభిమానుల్లో ఆనందం
మోహన్‌లాల్‌తో పాటు టోవినో థామస్, మంజు వారియర్, పృథ్వీరాజ్ సుకుమారన్, అభిమన్యు సింగ్ లాంటి బిగ్ స్టార్స్ కీలక రోల్స్‌లో మెప్పించారు. దీపక్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ఎక్స్‌ట్రా కిక్ ఇచ్చింది. పృథ్వీరాజ్ డైరెక్షన్ స్కిల్స్, మోహన్‌లాల్ యాక్టింగ్ పవర్ కలిసి ఈ మూవీని బ్లాక్‌బస్టర్ హిట్‌గా మార్చాయని సినీ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. మలయాళ సినిమా రేంజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లిన ‘L2 ఎంపురాన్’ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. ఈ సినిమా మరెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి!