Mohan Babu Attack On Media: వాళ్ళు ఏంటో ..వారి వ్యవహారం ఏంటో ఎవడికి అర్తం కానే కావు. ఏమన్నా అంటే కొడతాం , తిడతాం అంటారు. చిత్ర విచిత్రంగా …పూటకో రకంగా మాట్లాడే ..ఆ ఫామిలీ ఏది చేసిన ఒక వింతే. ఆ వింతలో ఉండే క్యారెక్టర్లు మాత్రం మామూలు మనుషులు కాదు. దెబ్బకు ఆ అచ్తింగ్ చూసి ..రెండు చేతులు జేబులో పెట్టుకుని లేచి అలా నడుచుకుంటూ వెళ్లిపోవాల్సిందే .
మంచు ఫ్యామిలీలో మొదలైన రచ్చ రోడ్డుకెక్కింది. హైదరాబాద్ జల్ పల్లిలోని ఇంటి వద్ద ఇప్పటికే భారీగా పోలీసులను మోహరించారు. అలాగే మంచు విష్ణు, మోహన్ బాబు, మనోజ్ లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మీడియా ప్రతినిధులపై దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు..
Mohan Babu Attack On Media: మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు హైబీపీ కావడంతో వెంటనే మంచు విష్ణును ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు.
తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబు బీపీ 200తో ఆసుపత్రికి వచ్చారని అన్నారు డాక్టర్స్. ఆయన ఎడమకంటికి స్వల్ప గాయమయ్యిందని.. ఇప్పుడు స్థిమితంగా లేరని.. మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని.. మరో రెండు రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని.. ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని అన్నారు.
Mohan Babu Attack On Media: కాంటీనెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. “మెడలో నొప్పి కాలులో నొప్పి బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా బాధ పడుతున్నారు. రాత్రి అంతా ఆయన నిద్ర లేక ఇబ్బందిపడ్డారు. ఎడమ కంటి కింద కమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేస్తాము. ప్రస్తుతం ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తాము ” అని అన్నారు.
మంగళవారం జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతోపాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే జర్నలిస్టుల నుంచి మైకు లాక్కుని ముఖంపై బలంగా కొట్టారు మోహన్ బాబు. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని నిరసిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈరోజు ఉదయం మంచు మనోజ్ మీడియ సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి, అన్న తరుపున మీడియాకు క్షమాపణలు చెప్పారు.