Viral News: ఎక్కడికి వెళ్తోంది ఈ సమాజం? కష్టపడటం కూడా తప్పేనా? మంచి ఉద్యోగం చేస్తేనే గౌరవం దక్కుతుందా? పిజ్జా డెలివరీ చేయడం తప్పా? అతని కష్టాన్ని చూడకుండా, అతను చేసే పనిని చూసి నవ్విన ఒక చిన్ననాటి స్నేహితురాలు..
అసలు విషయానికి వస్తే.. ఒక వ్యక్తి పిజ్జా డెలివరీ చేస్తూ తన చిన్ననాటి పాఠశాల స్నేహితురాలిని కలిశాడు. అతడిని చూసిన ఆమె, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. “ఇతను చిన్నప్పుడు స్కూల్లో అందరినీ బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవాడు, కానీ ఇప్పుడు పిజ్జా డెలివరీలు చేస్తున్నాడు” అంటూ వీడియో తీస్తూ.. “ఇప్పుడు ఇలా డెలివరీ చేస్తూ ఆనందంగా ఉన్నావా? బాగానే సంపాదిస్తున్నావా?” అని ఎద్దేవా చేసింది. అంతటితో ఆగకుండా, “ఈ వీడియో మన ఫ్రెండ్స్ అందరికీ పంపిస్తాను” అని చెప్పింది.
ఇది కూడా చదవండి: KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు సిట్ రెండో నోటీసు.
ఆ సమయంలో అతని కళ్లలో ఉన్న బాధను ఆ యువతి చూడలేకపోయింది. అందరికీ జీవితం ఒకేలా ఉండదు. అతనికి ఎన్నో కలలు ఉండొచ్చు, జీవితంలో ఏదో ఒకటి సాధించాలనుకున్నా పరిస్థితులు కుదరలేదేమో. కుటుంబ సమస్యల వల్ల కుటుంబాన్ని పోషించడానికి ఏదో ఒక పని చేయాలనే ఉద్దేశంతో దీనిని మొదలుపెట్టి ఉండవచ్చు. కొన్నిసార్లు బాధ్యతలు వయసు కంటే ముందే వస్తాయి.. అప్పుడు కలలు సమాధి అవుతాయి, ఆత్మగౌరవం పరీక్షించబడుతుంది. పిజ్జా డెలివరీ చేయడం సిగ్గుచేటు కాదు, కానీ ఒకరి పోరాటాన్ని ఎగతాళి చేయడం మాత్రం సరైంది కాదు.
ఒక పిజ్జా డెలివరీ బాయ్ తన స్కూల్ టైమ్ స్నేహితురాలిని రోడ్డు మీద కలిశాడు…
ఆమె రికార్డ్ చేయడం మొదలుపెట్టి అతన్ని ఎగతాళి చేసింది: “నువ్వు స్కూల్లో అందరినీ ప్రేరేపించేవాడివి… ఇప్పుడు పిజ్జా డెలివరీ చేస్తున్నావా?” అంటూ తర్వాత ఆమె ఆ వీడియోను ఇతర స్నేహితులకు కూడా పంపుతానని చెప్పి… pic.twitter.com/7G4qb0txEf
— Telugu Stride (@TeluguStride) January 30, 2026
