Duvvada Madhuri

Duvvada Madhuri: అనుమతి లేని మద్యం పార్టీ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దంపతులు అరెస్ట్!

Duvvada Madhuri: ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ దంపతులు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వీరు హైదరాబాద్ సమీపంలో, రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో గల ది పెండెంట్‌ ఫామ్‌ హౌస్‌లో అనుమతి లేకుండా అక్రమంగా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు స్థానిక పోలీసులతో కలిసి ఆ ఫామ్‌హౌస్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ తన ముఖ్య అనుచరుడైన పార్థసారథి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. అయితే, శుక్రవారం రోజున ఎమ్మెల్సీ భార్య దువ్వాడ మాధురి పుట్టినరోజు కావడంతో, పార్థసారథి పేరు మీద ఫామ్‌హౌస్‌ను బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీకి మొత్తం 29 మంది హాజరైనట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ పార్టీలో మద్యం సరఫరా జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది.

పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు, అక్కడ 10 స్కాచ్‌ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లు మరియు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించినందుకు గాను, పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన భార్య మాధురి కూడా అరెస్ట్ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *