Mitchell Starc

Mitchell Starc: స్టార్క్ సంచలనం: వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వికెట్ల ఫీట్!

Mitchell Starc: ఆస్ట్రేలియా పేస్ దళానికి నాయకత్వం వహిస్తున్న స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 2025-26 యాషెస్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌ తొలి రోజున (డిసెంబర్ 4, గురువారం) సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఆరు వికెట్ల హాల్ సాధించిన తొలి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్‌గా స్టార్క్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. మిచెల్ స్టార్క్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

వెస్టిండీస్‌తో మూడో టెస్ట్ (జూలై 2025): రెండో ఇన్నింగ్స్‌లో 9 పరుగులిచ్చి 6 వికెట్లు (6/9) పడగొట్టాడు.
యాషెస్ తొలి టెస్ట్ (పెర్త్): తొలి ఇన్నింగ్స్‌లో 12.5 ఓవర్లలో 58 పరుగులకు 7 వికెట్లు (7/58) తీశాడు.
యాషెస్ రెండో టెస్ట్ (బ్రిస్బేన్): పింక్ బాల్ (డే/నైట్) టెస్టు తొలి రోజు, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో మళ్ళీ ఆరు వికెట్లు (6/71) పడగొట్టాడు.

Also Read: India vs South Africa 3rd ODI: వైజాగ్‌లో భారత్-దక్షిణాఫ్రికా పోరు! ప్లేయింగ్ XIలో కీలక మార్పులు

వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ఆరు వికెట్ల హాల్ సాధించిన తొలి బౌలర్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన టామ్ రిచర్డ్‌సన్ (1895-96లో) రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఇమ్రాన్ ఖాన్ కూడా 1982-83లో భారత్‌పై ఆడిన వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వికెట్ల (ఒక మ్యాచ్‌లో 8 వికెట్లు) ఫీట్ నమోదు చేశాడు. ఇప్పుడు ఈ అరుదైన జాబితాలో స్టార్క్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్లలో ప్రవేశించి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఆరు వికెట్ల ప్రదర్శనతో స్టార్క్ మరో భారీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌గా పాకిస్థాన్ దిగ్గజం వాసీం అక్రమ్ (414 వికెట్లు) రికార్డును అధిగమించాడు.

స్టార్క్ తన టెస్ట్ వికెట్ల సంఖ్యను 418కి పెంచుకున్నాడు. పింక్ బాల్ టెస్ట్‌లో స్టార్క్ మొదటి ఓవర్‌ చివరి బంతికే ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్‌ను స్లిప్స్‌లో మార్నస్ లబుషేన్ చేతికి చిక్కేలా చేసి తన వికెట్ల వేటను ప్రారంభించాడు. ఆ తర్వాత ఓవర్‌లో ఓలీ పోప్‌ను బౌల్డ్ చేశాడు. అనంతరం, ఇంగ్లాండ్ వైస్-కెప్టెన్ హ్యారీ బ్రూక్ (31), విల్ జాక్స్‌లను స్టీవ్ స్మిత్ క్యాచ్ పట్టగా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సెలను కూడా అవుట్ చేసి తన ఆరు వికెట్ల హాల్‌ను పూర్తి చేసుకున్నాడు. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ క్యాచ్‌తో అతనికి అద్భుత సహకారం అందించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *