Miss World Competitions: మిస్ వరల్డ్ 72వ ఫినాలే వేడుకలు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో మిస్ వరల్డ్ 72వ విజేతగా థాయ్‌లాండ్ సుందరి సుచాత సువాంగ్ నిలిచారు. 71వ మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా ఈ మేరకు సుచాతకు అలంకరించారు. రెండో స్థానంలో ఇథియోఫియా, మూడో స్థానంలో పోలెండ్, నాలుగో స్థానంలో మార్టినిక్ యువతులు నిలిచారు.
Miss World Competitions: న్యాయనిర్ణేతలు ఖండాల వారీగా టాప్ 10 నుంచి షార్ట్ లిస్ట్ చేశారు. అమెరికా ఖండం నుంచి మార్టినిక్, ఆఫ్రికా నుంచి ఇథియోఫియా, యూరఫ్ నుంచి పోలెండ్, ఆసియా నుంచి థాయ్‌లాండ్ సుందరీమణులను ఎంపిక చేశారు. వీరిలో థాయ్ సుందరి సుచాత విజేతగా నిలిచింది. నువ్వు మిస్ వరల్డ్ అయితే ఏం చేస్తావు.. అని అడిగిన ప్రశ్నకు 45 సెకన్లలో మెరుగైన సమాధానం ఇచ్చిన వారికి న్యాయ నిర్ణేతలు మార్కులు వేశారు. ఇండియా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న నందినీ గుప్తాకు చోటు దక్కలేదు.
Miss World Competitions: మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ అయిన సుధారెడ్డికి మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ అవార్డును అందుకోవడం ఆనందంగా ఉన్నదని తెలిపారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, పర్యాటక శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
Miss World Competitions: మిస్ వరల్డ్ ఫినాలేకు న్యాయ నిర్ణేతలుగా జూలియా మోర్లీ, సోనూ సూద్, సుధారెడ్డి, రానా దగ్గుబాటి, జయేశ్ రంజన్, మనూషి చిల్లర్, నమ్రత శిరోద్కర్, డోనావాల్ష వ్యవహరించారు. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఫైనల్ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులతోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ తమ కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. వీరితో పాటు ప్రముఖ నటుడు చిరంజీవి దంపతులు, నిర్మాత దిల్ రాజు, నటుడు విజయ్ దేవరకొండ తదితరులు హాజరయ్యారు.