Pushpa 2

Pushpa 2: పుష్ప 2కు మెగా క్యాంప్ నుంచి ఫస్ట్ విషెస్.. ఎవరు చెప్పారంటే..

Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప2 సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో అందరూ పుష్ప2 సినిమాపై గట్టి అంచనాలతో ఉన్నారు. ప్రేక్షకుల్లో కూడా సినిమా పై చాలా అంచనాలు ఉన్నాయి. ఇక ఫ్యాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు. అయితే, మెగా ఫ్యాన్స్ మాత్రం సినిమా విషయంలో అసంతృప్తి తో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ మెగా క్యాంప్ కి దూరంగా ఉంటున్నారని భావిస్తున్న మెగా ఫ్యాన్స్ ఆయన సినిమా విషయంలో నెగెటివిటీతో వ్యవహరిస్తున్నారని టాలీవుడ్ టాక్. ఆ టాక్ నిజమే అన్నట్టుగా పుష్ప2 సినిమా విషయంలో మెగా క్యాంప్ నుంచి ఇప్పటివరకూ ఎటువంటి రెస్పాన్స్ రాలేదు.

Pushpa 2:  సినిమా గురించి ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. దానికి తోడు మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా మెగాస్టార్ చిరంజీవిని పిలిచినా రాలేదనే వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా క్యాంప్ సినిమాకి దూరం అనే విషయంలో వస్తున్న టాక్ నిజమేనని వాదన గట్టిగ వినిపించింది.

Pushpa 2: అంతేకాదు.. ఇప్పటివరకూ మెగా క్యాంప్ లోని ఏ ఒక్కరూ కూడా పుష్ప2 సినిమాకు సంబంధించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో ఒక మెగా హీరో ఇప్పుడు పుష్ప2 సినిమా సక్సెస్ కావాలని కోరుతూ సోషల్ మీడియా X లో పోస్ట్ చేశారు. ఆ మెగా హీరో ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్. ఆయన పుష్ప2 లో అల్లు అర్జున్ పోస్టర్ షేర్ చేస్తూ.. సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. మెగా క్యాంప్ నుంచి ఒకరు అల్లుఅర్జున్ కు సపోర్ట్ గా నిలిచారని అందరూ అనుకుంటున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *