Meerpet Murder: హైదరాబాద్ మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో మహిళ వెంకటమాధవి మర్డర్ కేసులో మరో కోణం బయటకొచ్చింది. ఇప్పటిదాకా చంపిన తన భార్యను ఏం చేశాడన్న కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతున్నది. నిందితుడి పొంతనలేని సమాధానాలతో సంతృప్తి చెందని పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. అయితే వెంకటమాధవిని ఆమె భర్త గురుమూర్తి చంపిన తర్వాత ఆనవాళ్లు లేకుండా చేసేందుకు అతను ఓ సినిమాను పదేపదే చూసినట్టు వెల్లడైంది.
Meerpet Murder: ఇప్పటిదాకా ఎలాంటి క్లూ దొరకకపోవడంతో నిందితుడిపై ఇంకా పోలీసులు ఎలాంటి చర్యలకు దిగలేదు. నిందితుడు, వెంకటమాధవి భర్త అయిన గురుమూర్తి ఇంటిలోని గోడలకు, కుక్కర్‌లో రక్తపు మరకలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక సోమవారమే అందనున్నది. ఇదేరోజు సాయంత్రం కేసు వివరాలు వెల్లడించి, నిందితుడిని రిమాండ్‌కు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Meerpet Murder: గురుమూర్తి కొట్టిన దెబ్బలకు వెంకటమాధవి చనిపోయింది. ఆ తర్వాత అతనిలో కొంత భయం, న్యూనతా భావం నెలకొన్నది. తన వారికి ఎలా చెప్పాలి, అత్తామామలు ఏమనుకుంటారు, బంధువులు ఏమంటారోననే భయంతో ఎలాగైనా డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయలని అనుకున్నాడు. ఈ దశలో డెడ్‌బాడీ ఇంటిలో ఉండగానే, మలయాళ హిట్ సినిమా సూక్ష్మదర్శిని అనే సినిమాను పలుమార్లు చూశాడు. ఆ సినిమాలోలాగానే తన భార్య మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడని పోలీసుల తేలింది.
Meerpet Murder: నజ్రియా, బసల్ జోసఫ్ ప్రధాన పాత్రలో ఎంసీ జతిన్ రూపొందించిన మిస్టరీ థ్రిల్లర్ సూక్ష్మదర్శిని మలయాళంలో చిన్నచిత్రంగా విడుదలై భారీ కనెక్షన్లను సొంతం చేసుకున్నది. తెలుగులోనూ హాట్‌స్టార్‌లో ఈ సినిమా అందుబాటులో ఉన్నది. తన చుట్టుపక్కల విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్న కుతూహాలం ఉన్న ఓ మహిళ.. తన పక్క ఇంటిలో జరిగిన ఘోరమైన నేరాన్ని ఎలా బయటపెట్టిందన్నదే ఈ సినిమా సారాంశం.
Meerpet Murder: సూక్ష్మదర్శిని సినిమాలో లాగానే వెంకటమాధవి మృతదేహాన్ని గురుమూర్తి డిస్పోస్ చేశాడు. ఆ తర్వాత కెమికల్స్‌లో నానబెట్టి, ఆపై కాల్చి పొడి చేశాడు. ఆ తర్వాత సాయంత్రం మీర్‌పేట పెద్ద చెరువులో వెదజల్లి వచ్చాడు. సాయంత్రం ఏమీ తెలియనట్టు తనకు చెప్పకుండానే వెంకటమాధవి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తల్లిదండ్రులకు గురుమూర్తి అబద్ధమాడాడు. వివిధ కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టడంతో పలు విషయాలు వెల్లడయ్యాయి.