Medaram Jatara 2026: తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ మహాజాతరను పురస్కరించుకొని పునరుద్ధరించిన ఆలయ గద్దెలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఘనంగా ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి నాలుగు రోజులపాటు మహా జాతర జరుగనుండగా, సోమవారం (జనవరి 19) గద్దెల పైలాన్‌ను సీఎం ప్రారంభించారు.
Medaram Jatara 2026: ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, వారి మనమడి రియాన్ష్‌తో కలిసి వనదేవతలకు తొలి మొక్కు చెల్లించుకున్నారు. సమ్మక్క, సారలమ్మకు మనమడితో కలిసి రేవంత్‌రెడ్డి 68 కిలోల బెల్లాన్ని తులాభారంతో వన దేవతలకు సమర్పించారు. ఈ పూజల్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Medaram Jatara 2026: వనదేవతలకు మొక్కులు తీర్చుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి కొన్ని భావోద్వేగా వ్యాఖ్యలు చేశారు. తన మరణం తర్వాత కూడా మేడారంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు గుర్తుండిపోతాయే ఘట్టమని భావోద్వేగంతో చెప్పారు. ప్రతి ఒక్కరికీ తన మరణానంతరం ఏమైనా గుర్తింపునిచ్చే పనిచేశానా? అని వెనక్కి తిరిగి చూసుకుంటే.. ఎక్కువ మంది జీవితాల్లో శూన్యం కనిపిస్తుందని, కానీ, నాకు ఈ రోజైనా మరణమంటూ వస్తే ఒక అద్భుతమైన చారిత్రక కట్టడాలను సమాజానికి అందించాననే సంతృప్తి మిగులుతుందని చెప్పారు.
