Viral News: ఇంతకుముందు రోజుల్లో ప్రేమించిన అమ్మాయిని ఎత్తుకెళ్లడానికి అబ్బాయి ఎంతో రిస్క్ తీసుకుని, పక్కా ప్లాన్‌తో వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాడు. అలా లేచిపోయిన వారిని కనిపెట్టడానికి కొన్ని నెలలు పట్టేది.. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. కులాంతర వివాహం చేసుకున్న కూతురిని ఎత్తుకెళ్తున్న కుటుంబసభ్యులు..
వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లాలోని ఎల్లాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.. ప్రణయ్ అనే యువకుడు, అదే ఊరిలో ఉండే వేరే కులానికి చెందిన యువతి.. ఇద్దరు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. ప్రేమ విషయం ఇంట్లో చెప్తే తమ వివాహానికి ఒప్పుకోరని కులాంతర వివాహం చేసుకున్నారు.
ఈ పెళ్లి నచ్చని యువతి కుటుంబ సభ్యులు ఎలాగైనా తమ కూతురిని తీసుకుని వెళ్లాలని నిర్ణయించుకుని, నాలుగు కార్లలో వచ్చి ప్రణయ్‌తో, ఇంక అతని కుటుంబంతో గొడవ పడి యువతిని కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.. మధ్యలో అడ్డువచ్చిన ప్రణయ్‌ని, అతని కుటుంబ సభ్యులని, ఇంకా స్థానికులని కూడా కొడుతూ (కార్లతో నెట్టేస్తూ) వెళ్లిపోయారు.
తమ పెళ్లికి ఇంట్లో వాళ్ళు అడ్డువస్తున్నారు అంటూ పోలీసులకు పెళ్లికి ముందే చెప్పింది ఈ జంట. దీంతో ఇరు కుటుంబాలని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. స్టేషన్‌లో సైలెంట్‌గా ఉంటూ వెనకాల ప్లాన్ వేసుకుంది యువతి కుటుంబం. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. పోలీసులకు ముందే చెప్పినా సరైన రక్షణ ఇవ్వలేకపోయారు అంటూ ఆరోపిస్తోంది ప్రణయ్ కుటుంబం.
