Mark Zuckerberg: మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ జెఫ్ బెజోస్ , బెర్నార్డ్ ఆర్నాల్ట్‌లను దాటుకుని ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్న వ్యక్తి అయ్యాడు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జుకర్‌బర్గ్ నికర విలువ ఇప్పుడు 211 బిలియన్ డాలర్లు అంటే రూ. 17.73 లక్షల కోట్లకు చేరుకుంది. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ 263 బిలియన్ డాలర్ల (రూ. 22.09 లక్షల కోట్లు) సంపదతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు.
Also Read: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 209 బిలియన్ డాలర్ల (రూ. 17.56 లక్షల కోట్లు) సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. LVMH CEO బెర్నార్డ్ ఆర్నాల్ట్ 193 బిలియన్ డాలర్ల (రూ. 16.21 లక్షల కోట్లు) నికర విలువతో నాల్గవ స్థానంలో ఉన్నారు.