Mangampet Incident

Mangampet Incident: పోలీసులు పట్టించుకోలేదు అని.. కువైట్ నుంచి వచ్చి చంపేశాడు

Mangampet Incident: తమకు అన్యాయం జరిగిదంటూ ఎవరైనా పోలీసులను ఆశ్రయించినప్పుడు సకాలంలో సరిగా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో, ఒక్కోసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఒక్కటి జరిగింది. తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అని తన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే. వాలు ఎలాంటి చెర్యలు తీసుకోకుండా ఉండడం వల్ల. బాధితుడు ఏకంగా ఇతర దేశమైన కువైట్‌ నుంచి వచ్చి అతడిని హత్య చేశాడు. ఎవ్వరికి తెలియకుండా తిరిగి కువైట్‌ వెళ్లిపోయాడు. అనంతరం అతడు వీడియో విడుదల చేశాడు. దీంతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతడు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం సంచలనంగా మారింది. 

ఇది కూడా చదవండి: Harish Rao: రేవంత్ రెడ్డి సర్కార్‌పై మండిపడ్డ హరీష్‌రావు

Mangampet Incident: ఓబులవారిపల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్‌లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు, ఆమె భర్త వద్ద ఉంచారు. ఇటీవల చెల్లెలి మామ మనవరాలి వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.ఆ విషయాన్ని బాలిక తన తల్లికి ఫోన్‌ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలికి ఫోన్‌ చేసి అడగ్గా, ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో తల్లి కువైట్‌ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు దివ్యాంగుడిని పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. 

తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటి అని తనలో తాను ఆవేదన చెందాడు. కువైట్‌ నుంచి వచ్చి, ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న దివ్యాంగుడి తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేశాడు. వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు. ఈ విషయంపై వివరణ ఇస్తూ  సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని తెలిపాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకనే హత్య చేశానని వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sugar Side Effects: చక్కెరతో జాగ్రత్త! ఇది 5 తీవ్రమైన జబ్బులకు కారణం కావచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *