రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో మందకృష్ణ మాదిగ మీడియాతో మాట్లాడారు.
గ్రూప్-1 పోస్టులకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయకపోతే తమ బిడ్డలు పదేండ్లు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.వర్గీకరణ తర్వాతే గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించాలి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ 2 నెలల్లో పూర్తి చేయాలని, అప్పటి వరకు కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయొద్దని రేవంత్ ఆదేశించారు.
కమిటీల పేరుతో కాలయాపన చేసి, కమిషన్ల పేరుతో జాప్యం చేసి, ఉన్న ఉద్యోగాలను కొల్లగొడుతాం అంటే మాదిగ జాతి ప్రజలు ఊరుకోరు అని హెచ్చరించారు. వర్గీకరణ చేయకుండా పరీక్షలు నిర్వహిస్తే ఉద్యమిస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు.

