Manchu Vishnu: హాలీవుడ్ కి మంచు విష్ణు..50 మిలియన్ డాలర్ల డీల్..

Manchu Vishnu: టాలీవుడ్ నటుడు, మంచు విష్ణు తన కెరీర్లోనే పెద్ద మలుపు తీసుకోవటానికి సిద్ధమయ్యాడు. ఆయన తాజా ప్రాజెక్టు “కన్నప్ప” షూటింగ్ పూర్తిచేస్తుండగా, ఒక గొప్ప వార్తను అభిమానులతో పంచుకున్నాడు. విల్ స్మిత్‌తో కలిసి హాలీవుడ్‌ స్థాయి ఓ భారీ ప్రాజెక్టులో పాల్గొనబోతున్నట్టు ప్రకటించాడు. ఈ ప్రాజెక్టు ద్వారా, మంచు విష్ణు “తరంగ వెంచర్స్” అనే కొత్త సంస్థను ప్రారంభించనున్నాడు. ఈ సంస్థ కోసం విల్ స్మిత్‌తో చర్చలు ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయి.

“తరంగ వెంచర్స్” అనేది మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, టెక్నాలజీ రంగాలలో పెట్టుబడులు పెట్టనున్న సంస్థ. ఈ సంస్థ ఓటీటీ ప్లాట్‌ఫాంలు, గేమింగ్, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), వెర్చువల్ రియాలిటీ (VR), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి అగ్రగామి టెక్నాలజీలలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఈ నిర్ణయం టాలీవుడ్‌ కోసం పెద్ద అడుగు అవుతుందని భావిస్తున్నారు, ఎందుకంటే మంచు విష్ణు టెక్నాలజీతో ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో కొత్త దిశలో ముందుకు పోతున్నాడు.

50 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ కొత్త సంస్థ పెట్టుబడుల వైపు చూస్తోంది. ఇంతకు ముందు టాలీవుడ్‌ లో ఏవైనా ఆర్థిక సహాయం అందించినప్పటికీ, ఈ సారి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని కూడా అందించనున్నారు, తద్వారా వినూత్న వ్యాపారాలు, స్టార్ట్-అప్‌లకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక, టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త దారులను తెరవాలని, ఈ నిర్ణయం టాలీవుడ్‌ ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు సినీ పెద్దలు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tirupati: తిరుపతి ఆలయానికి 4 పెద్ద వెండి దీపాలను విరాళంగా ఇచ్చిన ముగ్గురు బెంగళూరు భక్తులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *