Manchu Manoj: రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’లో భిన్న లుక్‌తో కనిపించాడు. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ అయింది. క్రూరమైన, క్షమాగుణం లేని పాత్రగా మనోజ్ ఆవిష్కరణ చేశాడు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారిపై పోరాడిన యోధుడి కథ ఇది. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Eesha rebba: ఓ వ్యక్తితో డేటింగ్ లో ఉన్నా..
మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తిని రేపింది. డిఫరెంట్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పింది. మనోజ్ ‘నాలోని కొత్త కోణం.. క్రూరమైనది.. క్షమాగుణం లేనిది’ అని క్యాప్షన్ పెట్టాడు. స్వాతంత్ర్యానికి ముందు బ్రిటిష్ వారిపై పోరాడిన ‘డేవిడ్ రెడ్డి’ యోధుడి కథ ఇది. సినిమాలో 700 కేజీల బరువుండే ‘వార్ డాగ్’ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రిన్స్ ఫేమ్ మరియా హీరోయిన్గా నటిస్తోంది. హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నారు. KGF, సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా మనోజ్ కమ్‌బ్యాక్‌కు బలమైన అవకాశంగా మారనుంది.
No Mercy and No Turning Back 🔥🏍️#DavidReddy Brutal Era Begins 🤘 pic.twitter.com/2MqxK2pCM2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) January 26, 2026
