Sasirekha: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాలోని ‘శంకర వర ప్రసాద్ నుండి శశిరేఖ’ అంటూ కొనసాగే రెండో సాంగ్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది.
అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తోంది. డిసెంబర్ 8న విడుదల కానున్న పూర్తి సాంగ్‌కి ప్రోమో రిలీజ్ చేశారు.
సంక్రాంతికి వచ్చిన సినిమాతో గత సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి… ఈసారి చిరంజీవితో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టి మెగాస్టార్‌కి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ అప్పియరెన్స్‌తో పాటు సాంగ్‌లో కూడా కనిపించనున్నారు.

