Man Steals Idol: పురాతన దేవతా విగ్రహం చోరీ

Man Steals Idol: దేవుడా దేవుడా..నా కోరిక తీర్చవా. నా కోరిక ఏంటంటే…కోరుకున్న తర్వాత …ఏమి రా ఎంత అహకారం నన్నే ఈ కోరిక కోరుకుంటావా అని అనకూడదు ? అని అన్నాడు ఓ దొంగ దేవుడితో . మొత్తానికి ఎలా చెప్పాడా …ఎలా చేసాడో తెలియదు కానీ..ఏకంగా గుడిలోని దేవుడినే దొంగలించేసాడు. దేవుడు కనిపించకపోవడంతో …ఆ దేవుడినే నమ్ముకున్న పూజారి ..నువ్వు తిరిగి వచ్చేవరకు నేను మంచి నీళ్లు కూడా ముట్టను అంటూ..గుడి ముందే కూర్చున్నాడు. ఆ నోటా ఈ నోటా విషయం తెలుసుకున్న ఆ మంచి దొంగ …దేవుడా నన్ను క్షమించు ,తప్పైపోయింది అంటూ …దేవుడిని గుడికి చేర్చాడు.

జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరుతూ లేఖలో ఇలా రాశాడు.. అలా లేఖలో ఇలా రాశాడు.. ‘అయ్యా పూజారి నేను పెద్ద తప్పు చేశాను.

Also Read:  ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే.. 

ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం వారం రోజుల క్రితం చోరీకి గురైంది. విగ్రహం చోరీ ఘటనపై ఆలయ అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 150 ఏళ్ల నాటి రాధా-కృష్ణ విగ్రహం కనిపించకపోవడంతో మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఆలయంలో చోరీకి గురైన పురాతన విగ్రహాన్ని తిరిగి ఇచ్చేశాడు సదరు దొంగ. దాంతో పాటు క్షమాపణ లేఖను కూడా గుడిలో పెట్టి వెళ్లాడు. తాను చేసిన నేరానికి క్షమాపణలు కోరుతూ క్షమాపణ లేఖను ఆలయ గుమ్మం వద్ద వదిలిపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ జిల్లాలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. సెప్టెంబర్ 23న నవాబ్‌గంజ్‌లోని రామ్ జానకి ఆలయంలో వందేళ్ల నాటి అష్టధాతువు రాధా కృష్ణ విగ్రహం చోరీ అయ్యింది. ఓ దొంగ గుడి తలుపు తాళం పగులగొట్టి రాధా-కృష్ణుల విగ్రహాన్ని ఎత్తుకెళ్లాడు. ఆలయ పూజారి ఫిర్యాదు మేరకు నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే వారం రోజులు గడిచినా పోలీసులు ఆ విగ్రహాన్ని గుర్తించలేకపోయారు. కాగా, పురాతన దేవతా విగ్రహం దొంగతనం పట్ల ఆలయ పూజారి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. విగ్రహం కోసం నిరవధిక నిరాహార దీక్షకు దిగాడు. ఈ క్రమంలోనే ఊహించని విదంగా చోరీకి గురైన విగ్రహం దొరికింది.

ALSO READ  Neem Leaves: చేదుగా ఉన్నప్పటికీ వేపాకులను తినండి.. గుండె భద్రం

Also Read: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

ఆలయం దొంగతనం జరిగిన వారం రోజుల తర్వాత జాతీయ రహదారిలోని గౌఘాట్ లింక్ రోడ్డు వద్ద ఒక గుర్తు తెలియని గోనె సంచి మూట ఒకటి కనిపించింది. అది చూసిన స్థానికులు అనుమానంతో తెరిచి చూడగా అందులో చోరీకి గురైన విగ్రహంతో పాటు ఒక లేఖ కూడా ఉంది. ఆ విగ్రహాన్ని గుర్తించి గౌఘట్ ఖల్సా ఆశ్రమానికి తీసుకెళ్లారు. విగ్రహాన్ని చోరీ చేసిన దొంగ ఆ లేఖలో క్షమాపణ కోరుతూ లెటర్ రాశాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *