Telangana: తెలంగాణ‌లో భారీగా ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్ అధికారుల బ‌దిలీలు

Telangana: తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐఎఫ్ఎస్‌ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. 13 మంది ఐఏఎస్‌, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారి ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి స్మితా స‌బ‌ర్వాల్‌ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, యువ‌జ‌న స‌ర్వీసుల కార్య‌ద‌ర్శిగా నియ‌మించ‌డంతోపాటు రాష్ట్ర ఫైనాన్స్ కార్య‌ద‌ర్శిగా అద‌న‌పు బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. బ‌దిలీ అయిన ఇత‌ర అధికారుల వివ‌రాలు కింది విధంగా ఉన్నాయి.
ఇలంబ‌రితి – జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌
డీ కృష్ణ‌భాస్క‌ర్ – ట్రాన్స్‌కో సీఎండీ, డిప్యూటీ సీఎం ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అద‌న‌పు బాధ్య‌త‌లు
సృజ‌న – పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి డైరెక్ట‌ర్‌
ఎస్‌. కృష్ణ ఆదిత్య – ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి
ఈ.శ్రీధ‌ర్ – బీసీ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి, దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్‌గా అద‌న‌పు బాధ్య‌త‌లు
అనితా రామ‌చంద్ర‌న్ – మ‌హిళా, శిశు సంక్షేమం, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్య‌ద‌ర్శి
కే సురేంద్ర మోహ‌న్ – ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్‌
సీహెచ్ హ‌రికిర‌ణ్ – ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్
శివ‌శంక‌ర్ – ఆరోగ్య‌శ్రీ ట్ర‌స్టు సీఈవో
గౌర‌వ్ ఉప్ప‌ల్ – జీఏడీ కార్య‌ద‌ర్‌శి
సంజ‌య్‌కుమార్ – లేబ‌ర్ క‌మిష‌న‌ర్‌
చిట్టెం ల‌క్ష్మి – ఆయుష్ డైరెక్ట‌ర్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ishan Kishan: ఇషాన్ రాకతో హైద్రాబాద్ ఓపెనింగ్ విషయంలో మూడుముక్కలాట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *