SRH: కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఒక పెద్ద షాక్ ఎదురైంది. దీని కారణంగా జట్టులోకి ఒక కొత్త క్రికెటర్‌ను చేర్చుకున్నారు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సోషల్ మీడియా వేదిక ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే…
ఇంగ్లాండ్ రైట్-ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఇటీవల గాయపడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కార్సే బొటనవేలికి గాయం తగిలింది. దీంతో అతను టోర్నమెంట్‌లోని మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ సందర్భంగా అతని స్థానంలో రెహాన్ అహ్మద్‌ను తీసుకుని ఆడించింది ఇంగ్లాండ్ జట్టు.
Also Read: Coal Mine Accident: కూలిన బొగ్గుగని గోడలు.. ముగ్గురు కార్మికుల మృతి
SRH: అయితే, ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా కార్సే కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దీని కారణంగా సన్‌రైజర్స్ తమ జట్టులోకి ఒక కొత్త ఆటగాడిని చేర్చుకున్నారు. 18వ సీజన్ మొత్తానికి కార్సే దూరమయ్యాడని సన్‌రైజర్స్ తెలిపింది. అతని స్థానంలో ఆల్-రౌండర్ వియాన్ ముల్దర్‌ను తీసుకున్నట్లు జట్టు ప్రకటించింది. రూ. 75 లక్షలకు అతనిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
వియాన్ ముల్దర్ ఒక పేస్ బౌలింగ్ ఆల్-రౌండర్. అతను రైట్-హ్యాండ్ బ్యాటర్ కూడా. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతను చివరిగా న్యూజిలాండ్‌పై ఆడాడు. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన అతను, కేన్ విలియమ్సన్ వికెట్‌ను మాత్రం తీసుకున్నాడు.

