SSMB29

SSMB29: మహేష్ సంచలనం SSMB29లో షర్ట్‌లెస్ యాక్షన్!

SSMB29: సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఓ అరుదైన ఫీట్ సృష్టించబోతున్నారు! రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం SSMB29లో మహేష్ తొలిసారి షర్ట్‌లెస్ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించనున్నారు. గతంలో ఎందరో డైరెక్టర్లు మహేష్‌ను ఇలాంటి సీన్ కోసం ఒప్పించేందుకు ప్రయత్నించినా, ఆయన ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ, రాజమౌళి మాయలో పడి మహేష్ ఈ కొత్త లుక్‌కు ఓకే చెప్పారు. ఈ సన్నివేశం షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు చిత్ర యూనిట్ వర్గాలు సమాచారం. మహేష్ సిక్స్‌ప్యాక్ లుక్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సీన్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. SSMB29 మరో బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, రాజమౌళి మార్క్ యాక్షన్ సీన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ ఈ కొత్త అవతారంలో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలంటే, కొంతకాలం వేచి ఉండాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *