Mahaa Vamsi Comment: ఇంటిలోపల ఉండాల్సిన వ్యవహారాలు గడప దాటితే ఏమవుతుంది. ఇదిగో ఇలా మంచు ఫ్యామిలీ స్టోరీలా ఉంటుంది. పెద్దమనుషులుగా పదిమంది ముందూ కనిపించేవారు.. తమ వ్యక్తిగత జీవితంలో కూడా అదేవిధంగా ప్రవర్తించాలి. కుటుంబ వ్యవహారాలను వీధిన పెట్టుకుని.. దీనిగురించి ఎవరూ మాట్లాడకూడదు అంటే ఎలా కుదురుతుంది. అందులోనూ సెలబ్రిటీలుగా వెలిగే వారి విషయంలో ఏ చిన్న సంఘటన అయినా దానిపై కచ్చితంగా చర్చ జరుగుతుంది.
మంచు మోహన్ బాబు.. ఇంటిలో ఇటీవల రేగిన మంటలు వీధిన పడ్డాయి. దానికి కారణం ఏమిటి? అనేది పక్కన పెడితే.. మీడియా కవరేజ్ కోసం వెళితే బౌన్సర్లతో గెంటించారు. మోహన్ బాబు స్వయంగా లోగోలు లాక్కుని వాటితోనే జర్నలిస్టులను కొట్టిన పరిస్థితి ఉంది. మీ సినిమాలకు ప్రమోషన్స్ కోసం మీడియా కావాలి. మీరు ఎక్కడికైనా వెళితే ఆఖరుకి శ్రీవారి దర్శనానికి వెళ్లినా మీడియాకు చెప్పి.. తిరుమల లోనే ఇంటర్వ్యూలిచ్చి ప్రచారం చేసుకోవడానికి మీడియా కావాలి. అదే మీ ఇంట రచ్చ పోలీస్ స్టేషన్లకు ఎక్కి.. మీ ఇంట బౌన్సర్లను పెట్టుకుని కుటుంబ సభ్యులే ఒకరిని ఒకరు తన్నుకుంటే మీడియా కవరేజ్ చేయడం తప్పా? మీడియా తన పని తాను చేస్తుంది. మీకు ఇష్టం అయితే మీడియాతో మాట్లాడవచ్చు. లేకపోతే లేదు. ఒకవేళ మీడియా మీ మీద తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుంది అని మీరు అనుకుంటే దానిని ఖండించడానికి మీకు అవకాశం కూడా ఉంది. మరి అలాంటప్పుడు మీరు మీడియాపై దాడి చేయడం ఎంతవరకూ సమంజసం? ఇది ఆలోచించుకోవాలి.
ఇది కూడా చదవండి: Mahaa Vamsi: షర్మిల మీద స్క్రిప్ట్ జగన్ ది..సునీత, విజయమ్మ మీద స్క్రిప్ట్ అవినాష్ ది..
Mahaa Vamsi Comment: ఇక మంచు ఇంట్లో మంటల విషయానికి వస్తే.. అసలు వారి మధ్య గొడవ ఏమిటి అనేది కూడా పక్కన పెడితే, తండ్రీ కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం.. ఈ గొడవ మధ్యలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి రావడం.. అది మీడియా మీద దాడి వరకూ పరిణమించడం.. పోలీసులు మోహన్ బాబు, విష్ణుల గన్ లను సరెండర్ చేయమని చెప్పడం.. వరుసగా జరుగుతూ వచ్చిన ఈ సంఘటనలు మంచు ఫ్యామిలీ స్టోరీని ప్రజల ముందు నిలబెట్టేశాయి అనడంలో సందేహం లేదు. సినిమా వేరు జీవితం వేరు.. ఎవరూ కూడా జీవితానికి అతీతులు కారు. అహం బ్రహ్మాస్మి అంటారు. అహాన్ని వదులుకుని జాగ్రత్తగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. అయినా.. ఎంతోమందికి జీవిత పాఠాలు నేర్పిన మంచు మోహన్ బాబుకి ఇది తెలీని విషయమా? చెప్పండి!