Mahaa Vamshi Coment: నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందనేది ఓ సామెత. దీనిని నూటికి నూరుపాళ్లు వంట పట్టించుకుంది సాక్షి! ఒక అబద్ధాన్ని ముందు ప్రచురించడం.. దానిని ప్రచారం చేయడం.. తరువాత జరిగిన విషయానికి ఈ అబద్ధాన్ని ఒక నిజానికి లింక్ చేసి.. ఆనాడే మేం చెప్పాం.. ఇదంతా కుట్ర.. అంటూ నోరు పారేసుకోవడం కోసం వైసీపీ నాయకులకు వెన్ను దన్నుగా ఉండడమే ఈ అసత్య సాక్షి చేసే పని. దాని పుట్టుక నుంచి పధ్ధతి ఇదే. దానికి ఉదాహరణలు కోకొల్లలు. తాజాగా తిరుమల లడ్డు వ్యవహారంలోనూ సాక్షి తన తప్పుడు కథనాలను వండి వడ్డించడం మానలేదు. దీంతో టీటీడీ అధికారులు సాక్షిపై కేసు వేశారు.
Mahaa Vamshi Coment: లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు. అందరికీ తెలిసిందే. వైసీపీ హయాంలో చేసిన అడ్డగోలు రివర్స్ టెండరింగ్ కలరింగ్ కు ఇది పరాకాష్ట. దీనిపై సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో ఒక సిట్ వేసింది కదా. ఇప్పుడు ఆ సిట్ తన పని తాను చేస్తుకుంటూ పోతుంది. లడ్డు నెయ్యి వ్యవహారంలో నిజాలు కక్కిస్తుంది. నెయ్యి దందాలో సొమ్ములు బొక్కిన వారి లెక్కలు తెలుస్తుంది. దీంతో గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు వైసీపీ పెద్దలు ఉలికులికి పడుతున్నారు. సిట్ లో నిజాలు బయటకు వస్తే ప్రజలను ఎలా మభ్యపెట్టి తాము గురివింద గింజలమని ఏవిధంగా చెప్పాలా అనే క్రమంలో సాక్షిలో ఒక అబద్ధపు ప్రచారం మొదలు పెట్టారు. ఇది ఎంత దారుణమైన ప్రచారం అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడు తిరుమలలో సమీక్ష నిర్వహించిన సమయంలో.. అధికారులకు దిశా నిర్దేశం చేశారట. సీబీఐ సిట్ నెయ్యి విషయంలో ప్రశ్నిస్తే తాము చెప్పినట్టే చెప్పాలంటూ బెదిరించారట. ఇదంతా సాక్షికి మాత్రమే కనిపించిందట.. వినిపించిందట. అక్కడ ఉన్న మిగిలినవారికి ఏమీ తెలియదట. ఈ అద్భుతమైన విషయాన్ని అర్జెంట్ గా ప్రజలకు చెప్పేయాలని పెద్ద కథనం అచ్చేసి వదిలేసింది. మరి అధికారులు ఊరికే ఉండరు కదా. అందులోనూ వారి ప్రతిష్ట కూడా దెబ్బతీసే పరిస్థితి వస్తే వారెందుకు ఊరుకుంటారు. వెంటనే ఇదంతా అబద్ధం. సాక్షి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ప్రజలను తప్పుదోవ పాటిస్తోంది అంటూ కేసు ఫైల్ చేశారు టీటీడీ అధికారి లోక్ నాధ్.
పెద్ద కథే!
Mahaa Vamshi Coment: సాక్షికి ఇది చాలా అలవాటైన పని. ఎందుకంటే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేస్తే.. దానిని చంద్రబాబు నాయుడుకు పూలమాలని నారాసురు చరిత్ర పేరుతో ఒక పెద్ద అసత్యపు కథనం వండి వడ్డించి.. ప్రజలను ఏమార్చింది. అదే ధైర్యంతో ఇప్పుడు శ్రీవారి లడ్డూ వ్యవహారంలోనూ తన మార్కు అనైతిక కథనాన్ని విచ్చల విడిగా రాసి పడేసింది. దీని వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఇప్పటి నుంచే.. ప్రజలను అధికారంలో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అందరినీ బెదిరించి.. నెయ్యి వ్యవహారంలో వైసీపీని.. జగన్ ని ఇరికించాలని చూస్తున్నారంటూ తప్పుదోవ పట్టిస్తూ వెళ్లడం. తరువాత సిట్ దర్యాప్తులో విషయం తేలినపుడు అదిగో అప్పుడే చెప్పాం కదా.. అధికారులతో తప్పుడు సాక్షాలు చెప్పించారు అని చెబుతూ మరో అబద్ధాన్ని ప్రచారం చేసి సానుభూతిని పొందడం. ఇప్పటివరకూ సాక్షికి ఇలాంటి కథనాలు కలిసి వచ్చి ఉండవచ్చు. కానీ, ఇది శ్రీవారి లడ్డు వ్యవహారం. ప్రజలకు ప్రతి విషయం తెలుసు. వారికీ సరైన అవగాహన ఉంది. వాళ్ళు నిజాలు తెలుసుకోగలరు.
మహా పై కేసులు..
Mahaa Vamshi Coment: ఇదిలా ఉంటే, అసత్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు మహాన్యూస్ పై వైసీపీ బ్యాచ్ ఏడు కేసులు పెట్టింది. 200 కోట్ల రూపాయలకు పైగా పరువు నష్ట పరిహారం కోరుతూ కేసులు వేశారు. ఇలాంటి బెదిరింపులకు ఇక్కడ ఎవరూ లొంగరు. ఇలాంటి అసత్య.. అనైతిక కథనాల సాక్షిపై ఎంతవరకూ అయినా పోరాడతాం.