Mahaa Involvement: మహా యోగాయ.. మహా భాగ్యాయ. యోగా… భారతదేశం ప్రపంచానికి అందించిన వరం. శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతిని ప్రసాదించే అమృతధార. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా.. విశాఖ గౌరవం ఇనుమడించేలా ఈ నెల 21న యోగా దినోత్సవాన్ని జరుపుతోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో స్వయంగా పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వ ప్రయత్నానికి మహాగ్రూప్ ఆఫ్ ఛానల్స్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. యోగా దినోత్సవం విజయవంతం కోసం మహా న్యూస్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే.. మహా యోగాంధ్ర పేరుతో రెండ్రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రజలకు అవగాహన కలిపిస్తోంది మహాగ్రూప్ ఆఫ్ ఛానల్స్.
ప్రధాని మోడీ సంకల్పం, చంద్రబాబు విజన్, ఆరోగ్యాంధ్ర సాధనలో మహా గ్రూప్ ముఖ్య పాత్ర వహిస్తోంది. యోగాతో ఆరోగ్యాంధ్ర సాకారం అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు మరింత ప్రచారం కల్పిస్తోంది. మీడియా అంటే కొన్ని పరిమితులకు లోబడి పనిచేయడం కాదని.. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను అమలు చేయడం మీడియా బాధ్యత అని మహాన్యూస్ విశ్వసిస్తోంది. ఆ క్రమంలోనే ప్రజా పోరాటాలకు అండగా, పాలకుల వైఫల్యాలపై ప్రశ్నించడమే నైజంగా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభ్యున్నతికి ముందుంటోంది మహాన్యూస్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో సుందరమైన విశాఖ నగరంలో ప్రపంచ యోగా డే నిర్వహించడం విశాఖపట్టణానికి లభిస్తున్న అరుదైన గౌరవం. మరోసారి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించనుంది విశాఖ. అలాంటి గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం మీడియా బాధ్యతగా మహాన్యూస్ భావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్న అనేక ప్రజోపయోగ అంశాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువ చేస్తున్న మహాన్యూస్.. యోగాంధ్ర సాధనను కూడా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తోంది.
Also Read: Lokesh Clarity To YCP: ఢిల్లీ పర్యటనలో లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Mahaa Involvement: ఈ నెల 18న.. విశాఖ సాగర తీరాన.. మహా గ్రూప్ ఆఫ్ చానల్స్ అధినేత వంశీకృష్ణ మారెళ్ల… మహా యోగాంధ్ర – ఫ్రైడ్ ఆఫ్ విశాఖ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. మహాన్యూస్ చేపట్టిన మహా యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలను, ఛానల్ చైర్మన్ హోదాలో ఉండి కూడా క్షేత్ర స్తాయిలో రిపోర్టింగ్ చేస్తూ.. ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పిస్తున్న వంశీకృష్ణ మారెళ్ల కృషిని ఈ సందర్భంగా మంత్రులు ప్రశంసించారు. అదే విధంగా గురువారం విశాఖ ఆర్కే బీచ్‌లో “వాక్ విక్ యోగాంధ్ర” పేరుతో నిర్వహించిన 2కె రన్‌లో ప్రత్యేక అతిథిగా వంశీకృష్ణ మారెళ్ల పాల్గొన్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో వేదిక పంచుకున్నారు. భారత్ యోగాని ప్రపంచానికి అందిస్తే.. భారత్ బ్రాండ్‌గా యోగాని ప్రపంచ చిత్రపటంలో నిలిపింది ప్రధాని మోడీ అన్నారు వంశీకృష్ణ మారెళ్ల.
విశాఖ సాగర తీరాన, ఆహ్లాదకరమైన వాతావరణంలో, యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ప్రజలకు యోగా ఖచ్చితంగా మేలు చేస్తుందని.. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా యోగా కోసం ఎంతో కొంత సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. వాస్తవాలకు ప్రతిరూపం మహాన్యూస్ అని, తెలుగు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అనుక్షణం పోరాటం చేస్తుందని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో జరిగే ప్రతి అంశాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడమే మహాన్యూస్ కర్తవ్యమని, పారదర్శకమైన జర్నలిజం నిర్వర్తించడంలో ఎల్లప్పుడూ ముందుంటామని మరొక్కసారి స్పష్టం చేశారు వంశీకృష్ణ మారెళ్ల. ఒక గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి, తన డైనమిక్ జర్నలిజంతో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ, మంచిని సమర్థిస్తూ, సూచనలు చేస్తూ… నేడు మహా గ్రూప్ అధినేతగా మహా వంశీ సాగిస్తున్న ప్రయాణాన్ని మంత్రులు కొనియాడారు.