Mahaa News Exclusive: అక్రమ మైనింగ్ దందాను బట్టబయలు చేసేందుకు ‘మహాన్యూస్’ ప్రతినిధుల బృందం భారీ పరిశోధనాత్మక కథనంతో రంగంలోకి దిగింది. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా సాగుతున్న ఈ అక్రమ తవ్వకాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? బినామీల పేరుతో కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నది ఎవరు? అనే అంశాలపై నేడు ఉదయం 10 గంటల నుండి ‘మహాన్యూస్’లో మహా ఫోకస్ పేరిట ప్రత్యేక కథనాలు ప్రసారం కానున్నాయి.
పర్యావరణ విధ్వంసం – ప్రభుత్వానికి కోట్ల నష్టం
ప్రకృతి ప్రసాదించిన ఖనిజ సంపదను కొందరు అక్రమార్కులు తమ స్వార్థం కోసం కొల్లగొడుతున్నారు. మైనింగ్ మాఫియా ఆగడాల వల్ల పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది.
పలుకుబడి ఉన్న వ్యక్తులు నేరుగా కాకుండా బినామీల పేర్లతో అక్రమ రవాణా సాగిస్తున్నట్లు మా పరిశోధనలో తేలింది. రాయల్టీ చెల్లించకుండా, పరిమితికి మించి తవ్వకాలు జరపడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయం మాఫియా జేబుల్లోకి చేరుతోంది. పర్యావరణ అనుమతులు (Environmental Clearances) లేకపోయినా, అధికారుల అండదండలతో యథేచ్ఛగా పగలు, రాత్రి తవ్వకాలు సాగిస్తున్నారు.
అడ్డుకట్ట వేసేది ఎవరు?
నిబంధనలను తుంగలో తొక్కి సాగుతున్న ఈ దందాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసి, ప్రకృతి సంపదను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నేటి మా ఎక్స్క్లూజివ్ కథనాల్లో అక్రమార్కుల గుట్టును పటాపంచలు చేస్తాం. చూస్తూనే ఉండండి ‘మహాన్యూస్’ మహా ఫోకస్.
