Maha Kumbh Mela 2025: మహాకుంభమేళాలో జరిగిన ఘోర విషాద ఘటన అనంతరం కఠిన ఆంక్షలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. మౌని అమావాస్యను పురస్కరించుకొని భక్తల తొక్కిసలాట జరిగి 30 మంది మృతి చెందారు. సుమారు 50 మందికి పైగా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై అప్రమత్తమైన అధికారులు కఠిన ఆంక్షలను వెంటనే అమలులోకి తెచ్చారు.
Maha Kumbh Mela 2025: ఈ మేరకు మహా కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతంలో వీవీఐపీ పాస్‌లను పూర్తిగా రద్దు చేశారు. మహాకుంభమేళా ప్రాంతానికి వచ్చే వాహనాలను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. వన్‌వేలో మాత్రమే ట్రాఫిక్‌కు అనుమతి ఇస్తున్నారు. సమీప జిల్లాల నుంచి వచ్చే వాహనాల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నారు.
Maha Kumbh Mela 2025: త్రివేణీ సంగమంలోకి అనుమతించిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, పూజలు చేసి బయటకు వచ్చిన తర్వాతే మిగతా భక్తులను అనుమతిస్తారు. కుంభమేళా నుంచి తిరిగి వెళ్లే వారి పరిమితి మేరకు ప్రత్యేక రైళ్లు, బస్సుల సౌకర్యం కల్పించనున్నారు. ఆయా నియమాలను కఠినంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.