Madhoo

Madhoo: ముద్దు సన్నివేశంపై మధుబాల ఆసక్తికర వ్యాఖ్యలు?

Madhoo: ప్రముఖ నటి మధుబాల తాజా ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. ఆమె చిన్నతనంలో నటించిన కొన్ని సన్నివేశాలు తన వాతావరణం వల్ల అసౌకర్యంగా అనిపించేవని వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో ముద్దు సన్నివేశంలో నటించాలని ఆమెను అడిగారు. అయితే, ఈ సన్నివేశం గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. “షూటింగ్‌కు ముందు ఒక్క మాటైనా చెప్పలేదేంటి?” అని దర్శక బృందాన్ని నిలదీసినట్లు తెలిపారు. ఆ సన్నివేశం అవసరమని దర్శకుడు బతిమాలడంతో, ఇష్టం లేకపోయినా నటించానని, కానీ ఆ సీన్‌కు సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో తొలగించారని ఆమె చెప్పుకొచ్చారు. ఆ రోజుల్లో తన వయసు చిన్నదని, కానీ ఈ రోజుల్లో యువ నటీమణులు తెలివిగా, ధైర్యంగా ఏ సన్నివేశానికైనా సిద్ధంగా ఉంటున్నారని మధుబాల అభిప్రాయపడ్డారు. ఇక సినిమాల విషయానికొస్తే, మధుబాల నటించిన ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Sankranthi Vasthunna: కామెడీ కాదు.. నిజం! బాహుబలి 2ను దాటేసిన సంక్రాంతికి వస్తున్నాం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *