Maa Kaali: గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో మంగళవారం త్రి భాషా చిత్రం ‘మా కాళి’ని ప్రదర్శించారు. రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను విజయ్ ఎలకంటి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. 1946లో డైరెక్ట్ యాక్షన్ డే జరిగిన సంఘటన ఆధారంగా ‘మా కాళీ’ సినిమా రూపుదిద్దుకుంది. దేశ విభజన ప్రకటన వచ్చిన నేపథ్యంలో అక్కడ జరిగిన దారుణ మారణ కాండను ఈ సినిమాలో చూపించామని, ఇది చెరిపేసిన బెంగాల్ చరిత్ర అని దర్శకుడు విజయ్ ఎలకంటి తెలిపారు. అతి త్వరలో తెలుగు, హిందీ, బెంగాలీ భాషల్లో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయబోతున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. గోవాలో తమ చిత్రం పీమియర్ షో జరగడం పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.