LIK: స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తన రాబోయే చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెట్స్ నుంచి ఆకట్టుకునే బీటీఎస్ మూమెంట్స్ ని అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తుండగా, నయనతార నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఎస్.జె. సూర్య, గౌరీ కిషన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: Tarun Bhaskar: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా కొత్త సినిమా!
సెప్టెంబర్ 18న ఈ సినిమా విడుదల కానుంది. విగ్నేష్ శివన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు సినిమా సెట్స్‌లోని సరదా వాతావరణాన్ని, టీమ్ మధ్య సాన్నిహిత్యాన్ని చూపిస్తున్నాయి. ప్రదీప్‌ను తన ఫేవరెట్ యాక్టర్‌గా పేర్కొంటూ విగ్నేష్ ప్రశంసలు కురిపించారు. సినిమాటోగ్రాఫర్ రవి వర్మన్, ప్రొడక్షన్ డిజైనర్ ముత్తురాజ్‌లను కూడా ఆయన మెచ్చుకున్నారు. ఈ బీటీఎస్ మూమెంట్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.