Lokah: మలయాళ సినిమా #లోక బాక్సాఫీస్‌లో దుమ్మురేపుతోంది. మహిళా సూపర్‌హీరోగా రూపొందిన ఈ చిత్రం ఇప్పటి దాకా రూ.100 కోట్లు వసూలు చేసి, కీర్తి సురేష్ నటించిన మహానటి (రూ.85 కోట్లు) రికార్డును అధిగమించింది. ఏడేళ్లుగా నిలిచిన ఈ రికార్డును లోక సునాయాసంగా బద్దలు కొట్టింది. శక్తివంతమైన కథ, అద్భుతమైన నటన, సాంకేతిక విలువలతో ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మలయాళ సినిమా స్థాయిని అంతర్జాతీయంగా చాటిన ఈ చిత్రం, మహిళా కథానాయకుల సినిమాలకు కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ విజయం మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి గర్వకారణం. మరి ఈ సినిమా లాంగ్ రన్ లో ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

