Local Body Elections: తెలంగాణ రాష్ట్రంలో ప్రాదేశిక, పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపింది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు దశలో జరగాయి. కానీ, ఈ సారి రెండు దశల్లోనే నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘానికి పంచాయతీరాజ్ శాఖ తెలిపింది.
Local Body Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒక విడత, పంచాయతీ ఎన్నికలను మరో విడత నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తున్నది. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లను చేసింది. ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో రెండు దశలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలను జారీ చేసింది.
Local Body Elections: ఇప్పటికే తొలుత నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఉంచే బ్యాలెట్ పేపర్లను సైతం సిద్ధం చేసి ఉంచింది. పోలింగ్ అధికారులు, సిబ్బందిని ఎంపిక చేసింది. ఎన్నికల షెడ్యూల్ రాగానే శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వెంటనే రంగంలోకి దిగేలా అంతటా అలర్ట్ చేసి ఉంచింది. ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసి ఉంచింది.
