Local Body Elections: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని జిల్లాల కలెక్టర్లతో తాజాగా కీలక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో కీలక అంశాలను వెల్లడించారు. మున్సిపల్ వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, ఎన్నికల సంసిద్ధతపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆమె ఆదేశించారు.
Local Body Elections: జిల్లాలవారీగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పరిధి ఓటరు జాబితాలపై వచ్చిన అభ్యంతరాల వివరాలను సమీక్షించి పారదర్శకంగా తుది జాబితాలను నిర్ణయించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. ఈ మేరకు జనవరి 12వ తేదీన వార్డుల వారీగా ఫొటో ఎలక్టోరల్స్ జాబితా ప్రచురిస్తారు. అదే విధంగా ఆ మరునాడైన 13వ తేదీన డ్రాప్ట్ పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రచురిస్తారు.
Local Body Elections: జనవరి 16వ తేదీన తుది పొలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల సంఘం వెల్లడిస్తుంది. పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఎలక్టోరల్ జాబితాలు ప్రచురిస్తారు. వాస్తవంగా 2025 నవంబర్ 15న మూడో సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదలైంది. దాని ప్రకారమే పట్టణాల్లోని వార్డుల వారీగా డ్రాప్ట్ ఓటరు జాబితాను 2026 జనవరి 1వ తేదీన విడుదల చేశారు. పోలింగ్ సందర్భంగా అవసరమైన చోట వెబ్ కాస్టింగ్‌కు చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేసింది. వార్డుల ఏర్పాటు విషయంలో ఏర్పడిన తప్పిదాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సంఘం ఆదేశించింది.
