Data Breach

Data Breach: చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ: 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు లీక్‌!

Data Breach: డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరాలు చాలా ప్రమాదకరంగా మారుతున్నాయి. తాజాగా, ఆన్‌లైన్ చరిత్రలోనే అతిపెద్ద డేటా చోరీ ఒకటి వెలుగులోకి వచ్చింది. సైబర్ భద్రతా పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం, యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్, గిట్‌హబ్, టెలిగ్రామ్ వంటి పెద్ద సంస్థలతో పాటు కొన్ని ప్రభుత్వ వెబ్‌సైట్ల నుండి దాదాపు 16 బిలియన్ల (1600 కోట్లు) యూజర్ల లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాయి.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఈ డేటా చోరీలో అనేక రకాల సామాజిక మాధ్యమాల ఖాతాలు, పెద్ద టెక్ కంపెనీల యూజర్ల పాస్‌వర్డ్‌లు, ఇంకా VPN లాగిన్‌లు, కార్పొరేట్ డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లకు చెందిన వివరాలు కూడా ఉన్నాయి. సైబర్ పరిశోధకులు మొత్తం 30 డేటాసెట్‌లను కనుగొన్నారు. ఒక్కో డేటాసెట్‌లో 3.5 బిలియన్ల రికార్డులు (సమాచారం) ఉన్నట్లు గుర్తించారు. 2025 ప్రారంభం నుండి ఈ ఖాతాలలో లాగిన్ అయిన అన్ని వివరాలు ఈ డేటాలో ఉన్నాయని చెబుతున్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో యూజర్ల వివరాలు బయటపడటంతో సైబర్ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించడం, అలాగే ఫిషింగ్ దాడులు చేయడం వంటి వాటికి ప్రణాళికలు వేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో 184 మిలియన్ల (18.4 కోట్లు) యూజర్ల వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 16 బిలియన్లకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Upasana: రామ్‌చ‌ర‌ణ్‌-ఉపాస‌న కూతురు క్లీంకార‌కు పుట్టిన‌రోజు వినూత్న కానుక‌.. జూపార్క్ గ్రీటింగ్స్‌

Data Breach: ఇలాంటి డేటా చోరీల నుండి తమను తాము రక్షించుకోవడానికి గూగుల్ తన యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. పాత పాస్‌వర్డ్‌లను మార్చుకొని, వాటిని మరింత బలంగా పెట్టుకోవాలని సలహా ఇచ్చింది. అలాగే, మెయిల్ ద్వారా ఖాతాలను మరింత భద్రంగా ఉంచుకోవాలని సూచించింది.

గూగుల్ తన యూజర్లను ‘పాస్‌కీలు’ ఉపయోగించమని ప్రోత్సహిస్తోంది. పాస్‌కీలు అంటే, పాస్‌వర్డ్‌ల స్థానంలో స్మార్ట్‌ఫోన్ వంటి పరికరాల ద్వారా వేలిముద్ర లేదా ముఖాన్ని స్కాన్ చేసి లాగిన్ అయ్యే పద్ధతి. ఇది ఫిషింగ్ దాడుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ భారీ డేటా చోరీ వెనుక ఎవరున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, అనేక సైబర్ గ్రూపుల ప్రమేయం ఉందని పరిశోధకులు అనుమానిస్తున్నారు. ప్రజలు తమ ఆన్‌లైన్ ఖాతాలను సురక్షితంగా ఉంచుకోవడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని నిపుణులు గట్టిగా సూచిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jupally Krishna Rao: ఈ సారి అంగరంగ వైభవంగా.. తెలంగాణలో బతుకమ్మ వేడుకలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *