Lagacharla

Lagacharla: కేసులో ట్విస్ట్..నరేందర్ రెడ్డి రిమాండులో కూడా కీలక విషయాలు

Lagacharla: వికారాబాద్‌ జిల్లా లగచర్లలో జరిగిన అధికారులపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేత, కోడంగల్ మాజీ ఎమ్మెల్యే అరెస్టు, రిమాండు ట్విస్టులతో పాటు ఇంతకుముందే అరెస్టు వారి గురించి పెద్ద ట్విస్టు బహిర్గం అయ్యింది. వికారాబాద్‌ జిల్లా మల్టీ జోన్‌ ఐజీ సత్యనారాయణ దీనికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. లగచర్ల ఘటనలో మొదట 47 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిలో 16 మందిని రిమాండ్‌కు తరలించామన్నారు.
బుధవారం మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు. మిగతా వారి కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. మరోవైపు ‘అధికారులను తప్పుదోవ పట్టించిన సురేశ్‌పై గతంలో కేసులున్నాయని వెల్లడించారు. ఉన్నతాధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదు. కొందరికి భూమి ఉన్నా.. భూసేకరణ పరిధిలోకి రాదని గుర్తించినట్లు వివరించారు. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని, నిందితులు హైదరాబాద్‌ పరిసరాల్లో ఉన్నట్టు గుర్తించడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి: TDP: అయ్యో పాపం.. వీరేమి చేశారు నేరం?

కేటీఆర్, నేతల ఆదేశాలతోనే పక్కా వ్యూహాం. ఈ ఘటనలో కీలకంగా వ్యవహరించిన సురేశ్‌కు తరచూ ఫోన్‌ చేసినట్లు నరేందర్‌ రెడ్డి అంగీకరించారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు తెలిపారు. నరేందర్‌రెడ్డిని బుధవారం కొడంగల్‌ కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్లలో ఉన్నతాధికారులపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నారని రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కేటీఆర్‌, భారాస ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు వెల్లడించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *