Kushboo

Kushboo: విశాల్ అనారోగ్యంపై ఖుష్బూ వివరణ!

Kushboo: ప్రముఖ నటి ఖుష్బూ భర్త, నటుడు, దర్శక నిర్మాత సి సుందర్ రూపొందించిన సినిమా ‘మద గజ రాజా’. దాదాపు పన్నెండేళ్ళ క్రితం విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి, విడుదలకు నోచుకోలేదు. మళ్ళీ ఇంతకాలానికి తమిళంలో దీనిని రిలీజ్ చేసే పనిలో పడింది జెమినీ సంస్థ. సంక్రాంతి కానుకగా జనవరి 12న రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఆదివారం జరిగింది. అందులో హీరో విశాల్ సరిగా మాట్లాడలేకపోయాడు. చేతులు వణికిపోయాయి. చాలా నీరసంగా ఉన్నారు. దాంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే… రెండు రోజుల తర్వాత అపోలో హాస్పిటల్ వర్గాలు ఓ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశాయి.

ఇది కూడా చదవండి: Traffic Rules: ఆ రాష్ట్రంలో ఇకనుండి ‘నో హెల్మెట్, నో పెట్రోల్’ రూల్!

Kushboo: ఆయన పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నాయి. అసలు దానికి ముందు ఏం జరిగిందనే విషయాన్ని ఖుష్బూ వివరించారు. న్యూ ఢిల్లీ నుండి విశాల్ చెన్నయ్ వచ్చాడని, అప్పటికే అతనికి జ్వరంతో బాధపడుతున్నాడని, ప్రెస్ మీట్ కు రావొద్దని వారించినా, ఈ సినిమా గురించి తాను మాట్లాడాలని అనుకున్నాడని ఆమె చెప్పారు. ప్రెస్ మీట్ తర్వాత విశాల్ పరిస్థితి గమనించి, తామే హాస్పిటల్ కు తీసుకెళ్ళామని, అప్పటికే 103 జ్వరం ఉందని ఆమె తెలిపారు. ఇప్పుడు ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఖుష్బూ అన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *