Kuberaa: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కలిసి నటించిన బహుభాషా చిత్రం కుబేర తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ ఎమోషనల్ డ్రామా తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ధనుష్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన ఈ సినిమా, సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తెలుగులో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కుబేర, ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కానీ, తమిళనాట మాత్రం ఈ చిత్రం ఊహించని విధంగా నిరాశపరిచింది. విమర్శకులు మెచ్చినప్పటికీ, తమిళ ప్రేక్షకులు ఈ ఎమోషనల్ జర్నీని ఆస్వాదించడంలో వెనుకబడ్డారు. బైలింగువల్‌గా రూపొందిన ఈ సినిమా తమిళ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మినిమం వసూళ్లు కూడా రావట్లేదు. అయితే తెలుగులో మాత్రం కుబేర భారీ విజయం కొనసాగుతోంది.
