KTR: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, సీనియర్ నాయకుడు మన్నె క్రిశాంక్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి బాగోతాన్ని ఆధారాలతో సహా బయటపెట్టినందుకే కక్షపూరితంగా క్రిశాంక్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేరుగా ట్యాగ్ చేస్తూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కేటీఆర్ పదునైన పదజాలంతో ఘాటు విమర్శలు గుప్పించారు.
ప్రధాని కావాలనుకుంటారు.. కానీ పిరికివాడిలా వ్యవహరిస్తారు.. కేటీఆర్ సూటి దాడి
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ అక్రమంగా నిర్బంధించారని కేటీఆర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ.. ఇప్పటికైనా నీ కీలుబొమ్మ రేవంత్ రెడ్డిని అదుపులో పెట్టుకో. భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను అపహాస్యం చేయడం వెంటనే ఆపాలి” అని కేటీఆర్ హెచ్చరించారు. క్రిశాంక్ అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతుండగా.. కేటీఆర్ చేసిన ఈ ఘాటు పోస్ట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.
