KTR: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం ఆరోపణ కలకలం రేపుతోంది. విదేశీ బొగ్గు దిగుమతుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ.3,000 కోట్ల భారీ స్కామ్కు స్కెచ్ వేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బాంబు పేల్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఒక సంచలన బహిరంగ లేఖ రాశారు.
“తెలంగాణ కాంగ్రెస్ పాలన కేవలం అవినీతి చుట్టూనే తిరుగుతోంది. ఇక్కడ కిందిస్థాయి ఉద్యోగులు లంచాలు తీసుకోవడం కాదు.. ఏకంగా ముఖ్యమంత్రి నుంచే అవినీతి మొదలవుతోంది! సీఎం కార్యాలయం (CMO) 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తోందని ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) లిఖితపూర్వకంగా రాసిచ్చారంటే వ్యవస్థ ఎంతలా కుళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి తన సన్నిహితులకు, బినామీలకే ప్రాజెక్టులను కట్టబెడుతున్నారు.”“రేవంత్ రెడ్డికి రైతులు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యంపై ఎలాంటి ధ్యాస లేదు. తెలంగాణను నాశనం చేసి తన ‘అనుముల సామ్రాజ్యాన్ని’ నిర్మించుకోవడమే ఆయన ఏకైక లక్ష్యం. రేవంత్ రెడ్డి ఒక ఏటీఎం మెషీన్లా మారి డబ్బులు పంపుతున్నారు కాబట్టే ఢిల్లీలో రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ఆశ్చర్యంగా ఉంది!” అని కేటీఆర్ తన ట్వీట్లో నిప్పులు చెరిగారు.
పొలిటికల్ హీట్ – మంత్రుల కౌంటర్ వార్..
Congress Government in Telangana revolves only around CORRUPTION. It doesn’t start with a government employee taking small bribes, it starts with the CHIEF MINISTER himself!
When a company’s MD gives in writing that the CMO demands 15% commission and CM himself allots projects to cronies, you know how rotten the system is
Revanth Reddy doesn’t care about farmers, water, power, education or health. His only goal is to destroy Telangana to build his Anumula Empire
Rahul Gandhi is silent as Revanth is his ATM
Wonder why Narendra Modi won’t act??!!
#CongressFailedTelangana
— KTR (@KTRBRS) October 15, 2026
