KTR: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణ కోసం మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి సోమవారం ఉదయమే బయలుదేరి వెళ్లారు. బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్న సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. కేటీఆర్ తన వెంట న్యాయవాదులను తీసుకొని వెళ్తండగా, కార్యాలయం లోపలికి వెళ్తుండగా, కేటీఆర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
KTR: న్యాయవాదులను తన వెంట తీసుకెళ్లవద్దంటూ పోలీసులు కేటీఆర్‌ను వారించారు. చట్టప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న హక్కులను వినియోగించుకునే అవకాశం తనకూ ఇవ్వాలని పోలీసులతో కేటీఆర్ వాదించారు. అడ్వకేట్లను తనతో అనుమతించాలని కేటీఆర్ కోరారు. ఏసీబీ అధికారుల నుంచి కూడా ఎటువంటి అనుమతి రాలేదు. సుమారు 45 నిమిషాల పాటు కార్యాలయం బయటే వేచి ఉన్న కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.
KTR: ఇదిలా ఉండగా, కేటీఆర్ తనకు జరిగిన అన్యాయంపై ఏసీబీ ఏసీపీకి లిఖిత పూర్వక లేఖ రాశారు. గత
న్యాయవాదులతో అనుమతించాలని ఏసీబీ ఏసీపీని కోరారు. గతంలో జరిగిన కొన్ని కేసుల విషయంలో జరిగిన అన్యాయం తనకూ జరగొద్దనే తాను కోరుకుంటున్నానని, ఎట్టి పరిస్థితుల్లో న్యాయవాదులను అనుమతించాలని కోరారు. ఏసీబీ ఇచ్చిన నోటీసుకే కేటీఆర్ రిప్లై ఇచ్చినట్టు తెలుస్తున్నది.