KTR:

KTR: మాట నిలుపుకున్న కేటీఆర్‌.. సొంత ఖ‌ర్చుల‌తో అభిమానికి టీస్టాల్ ఏర్పాటు

KTR: బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ త‌న అభిమానికి ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకున్నారు. త‌న‌ పేరు పెట్టుకున్నాడ‌న్న కార‌ణంతో సిరిసిల్ల ప‌ట్ట‌ణంలో ఉన్న ఓ టీ దుకాణాన్ని మున్సిప‌ల్ సిబ్బంది తొల‌గించారు. త‌న‌ అభిమాని అయిన ఆ టీకొట్టు య‌జ‌మాని కుటంబాన్ని ఆనాడు అక్కున చేర్చుకొని కేటీఆర్ మాటిచ్చారు. రూ.5 ల‌క్ష‌లైనా ఖ‌ర్చు పెట్టిన మ‌రోచోట దుకాణాన్ని ఏర్పాటు చేయిస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. హామీ ఇచ్చి నెల‌రోజులు కూడా కాక‌ముందే కేటీఆర్ త‌న సొంత ఖ‌ర్చుల‌తో టీస్టాల్‌ను ఏర్పాటు చేయించారు. ఈ రోజు (మార్చి 23) ఆదివారం సాయంత్రం కేటీఆర్ ఆ టీస్టాల్‌ను త‌న చేతుల మీదుగా ప్రారంభించ‌నున్నారు.

KTR: గ‌తంలో సిరిసిల్ల ప‌ట్ట‌ణంలోని బ‌తుక‌మ్మ ఘాట్ వ‌ద్ద కేటీఆర్ ఫొటో పేరు ఉన్న కార‌ణంగా శ్రీనివాస్ అనే వ్య‌క్తి టీస్టాల్‌ను మున్సిప‌ల్ సిబ్బంది తొల‌గించారు. ఎందుకు తొల‌గిస్తున్నారని బాధితుడు అడిగితే.. ఇక్క‌డికొచ్చిన క‌లెక్ట‌ర్ సందీప్‌కుమార్ ఝూ తొల‌గించాల‌ని ఆదేశాలు ఇచ్చార‌ని, అందుకే తాము తొల‌గిస్తున్నామ‌ని ఆనాడు సిబ్బంది చెప్పారు. జేసీబీ ద్వారా ఆ టీస్టాల్‌ను తొల‌గించారు.

KTR: దీనిపై స్పందించిన కేటీఆర్‌.. ఆ టీస్టాల్ న‌డిపే శ్రీనివాస్ ఇంటికి ఆనాడే వెళ్లి ప‌రామ‌ర్శించారు. వారిని ఓదార్చారు. తానున్నానంటూ అభయం ఇచ్చారు. రూ.5 ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి అయినా నీకు టీస్టాల్ పెట్టిస్తా.. అని ఆనాడే కేటీఆర్ త‌న అభిమాని శ్రీనివాస్‌కు మాటిచ్చారు. ఆ హామీని నేడు నెర‌వేర్చారు కేటీఆర్‌. దీంతో ఆకుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

KTR: కేటీఆర్ అన్నంటే త‌న‌కెంతో అభిమాన‌మ‌ని, ఆయ‌న ఫొటో పెట్టుకున్నందుకే అధికారులు నా టీస్టాల్‌ను తొల‌గించారు.. అని శ్రీనివాస్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఈనాడు కేటీఆర్ అన్న నాకు కొత్త‌ టీస్టాల్ పెట్టించార‌ని, అందుకు నేను కృత‌జ్ఞుడిని.. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటా.. ఆయ‌న వెంటే ఉంటా.. అని ఆయ‌న చెప్పారు. అభిమానికి టీస్టాల్ పెట్టించిన‌ కేటీఆర్ విత‌ర‌ణ‌ను సిరిసిల్ల ప‌ట్ట‌ణవాసులు ప‌లువురు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *