ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు ఎప్పుడూ చూడలేదు. ఆయన్ని గ్రామాల్లో ప్రజలు అసహనంగా తిట్టుతున్నారు. నిజంగా సిగ్గు శరం ఉన్నవాడయితే బకెట్ నీళ్లలో మునిగి పోయేవాడు. కానీ రేవంత్‌కు అది లేదు, అందుకే పట్టించుకోవడం కూడా లేదు’’ అని కేటీఆర్ తీవ్రంగా ఎద్దేవా చేశారు.
“రుణ మాఫీ, రైతు భరోసా పై మోసం”
‘‘ఎన్నికల సమయంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పుడు రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశాడు. రైతుల కోసం కేసీఆర్ ఒక్క పంటకు ఎకరాకు రూ.10,000 ఇచ్చారు. కానీ రేవంత్ మాత్రం రెండు పంటలకు ఎకరాకు రూ.15,000 ఇస్తానని చెప్పి మోసం చేశాడు’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
“ఇచ్చిన హామీలను అమలు చేయని నేత”
‘‘అత్తకు నెలకు రూ.4000, కోడలకు రూ.2500 ఇస్తానన్న వాగ్దానాలు తుంచేసి ఇప్పుడు 100 సీట్లు గెలుస్తామని చాటుకుంటున్నాడు. అసలే ప్రజలు చెడు మాటలు చెబుతుంటే… ఢిల్లీకి వెళ్లినప్పుడు ‘చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా’ చూస్తున్నారు అని ఒక సీఎం మాటలాడతాడా?’’ అని విమర్శించారు.
“తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన సేవను నాక్కద్దుగా చెప్పడం న్యాయమా?”
‘‘తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ పాత్రను మరిచిపోయి, ఆయన మీద అవమానకరంగా మాట్లాడటం ఎంతవరకు న్యాయమే? రేవంత్ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కారణం కూడా కేసీర్గా కాదా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
“ప్రతిపక్షాలపై అరాచక పాలన”
‘‘మేము పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిపక్షాలపై బలాత్కారాలు చేయలేదు. కానీ ఇప్పుడు సామాన్య కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇదేనా ‘ఇందిరమ్మ రాజ్యం’? అభిప్రాయ స్వేచ్ఛను తొలగించి, ముఖ్యమంత్రిని పొగడమన్నదే ప్రజాస్వామ్య విధానమా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“బీఆర్‌ఎస్ తిరిగి బలపడుతుంది – కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారు”
‘‘పూర్వ మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాలు, మూడు జిల్లా పరిషత్తులు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది. నేను, హరీశ్ రావు గారు కార్యకర్తలకు అండగా ఉంటాం. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు మనం కలిసి కృషి చేయాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చా

