KTR: హరీష్ రావుకు సెట్ నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ స్పందించారు. కేటీఆర్ మాట్లాడుతూ, హరీష్ రావుకు SIT నోటీసులు ఇవ్వడం పూర్తిగా రాజకీయ వేధింపులలో భాగమేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, లొట్టపీసు కేసు అంటూ విచారణలు–కమిషన్ల పేరుతో బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో సింగరేణిలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని, కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని బంగారు బాతులా చూస్తూ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు.
అవినీతిని బయటపెట్టిన ప్రతిసారీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక మీడియా సంస్థ రాసిన వార్త ఆధారంగా SIT విచారణ వేయడం, ముగ్గురు జర్నలిస్టులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని వ్యాఖ్యానించారు. మరో పత్రిక ఇష్టం వచ్చినట్లు రాస్తే దానిపై ఎందుకు SIT వేయడం లేదని ప్రశ్నించారు. ఇన్ని కుంభకోణాలు జరుగుతున్నా వాటిపై మాత్రం SITలు వేయకపోవడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు
