KTR : సీఎం రేవంత్ రెడ్డి పది విమర్శలు చేశారు కేటీఆర్.ఇటీవల చెప్పిన “ఫార్మా విలేజ్ కాదు, పారిశ్రామిక కారిడార్” మాటలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు చెబుతున్నారని, “నాలుక లేని నరం ఏదైనా మాట్లాడుతుందట” అని కేటీఆర్ విమర్శించారు.
“మీ ప్రభుత్వమే చెప్పింది గెజిట్ నోటిఫికేషన్, అది స్పష్టంగా కొడంగల్‌లో ఫార్మా విలేజ్ కోసం భూములు సేకరించడమే” అంటూ కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు, “ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలు వేదికల మీద ప్రకటించారు. కానీ ఇప్పుడు “పారిశ్రామిక కారిడార్” అంటూ మాట మార్చి ఏమి చేస్తున్నారని” అని ఆగ్రహంగా చెప్పారు.
“పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యంలేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావు” అని రేవంత్ రెడ్డిని విమర్శించారు. “నువ్వు చెప్పినట్లు కాకుండా, కేవలం అబద్దాలే చెబుతున్నావు” అని తేల్చి చెప్పారు.
అలాగే, ” లగచర్ల దగ్గర, ప్రైవేట్ సైన్యంతో రైతుల్ని బెదిరించి, అక్రమ కేసులు పెట్టి, జైలులో వేసి, అణచివేత కొనసాగిస్తున్నావు” అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.తప్పు చేసినవాళ్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ అబద్దాలతోనే కాలం కటిపోతుంది అన్నట్లుగా, “మీరు చెబుతున్న అబద్దాలు ప్రజలకు తెలుస్తున్నాయి” అని కేటీఆర్ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుర్తించారు.
